హోమ్ /వార్తలు /తెలంగాణ /

మారనున్న ఆర్టీసీ మహిళా ఉద్యోగుల యూనిఫాం..

మారనున్న ఆర్టీసీ మహిళా ఉద్యోగుల యూనిఫాం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటిదాకా ఉన్న ఖాకీ యూనిఫాం స్థానంలో వేరే రంగు యూనిఫాం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం మహిళా ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది.

    ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన సీఎం కేసీఆర్ పలు కీలక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మహిళలకు రాత్రి 8గంటల వరకే డ్యూటీ, డ్రెస్ చేంజ్ గదులు,ఇష్టమైన రంగులో యూనిఫాం వంటి హామీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళా కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ముందుగా మహిళా ఉద్యోగుల యూనిఫాం రంగు మార్చాలని నిర్ణయించింది. ఇప్పటిదాకా ఉన్న ఖాకీ యూనిఫాం స్థానంలో వేరే రంగు యూనిఫాం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం మహిళా ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. మెజారిటీ మహిళా ఉద్యోగులు నేరేడు ఎరుపురంగు ఆఫ్రాన్ కావాలని కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ నేరేడు ఎరుపురంగు ఆఫ్రాన్ సాధ్యం కాకపోతే.. నీలం రంగు ఆఫ్రాన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రతీ మహిళా ఉద్యోగికి రెండు జతల ఆఫ్రాన్ అందజేయనున్నారు. అలాగే లేసులు లేని రెండు జతల షూస్ కూడా అందజేయనున్నారు. తమ పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు మహిళా కార్మికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Telangana, Telangana RTC strike, Tsrtc

    ఉత్తమ కథలు