తెలంగాణలో ఐదుగురు కొత్త ఆర్టీఐ కమిషనర్లు వీరే...

కట్టా శేఖర్ రెడ్డి, గుగులోతు శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మైదా నారాయణరెడ్డి, డాక్టర్ మొహ్మద్, అమీర్ హుస్సేన్‌లను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించింది.

news18-telugu
Updated: February 10, 2020, 8:46 PM IST
తెలంగాణలో ఐదుగురు కొత్త ఆర్టీఐ కమిషనర్లు వీరే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఐదుగురు కొత్త ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా శేఖర్ రెడ్డి, గుగులోతు శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మైదా నారాయణరెడ్డి, డాక్టర్ మొహ్మద్, అమీర్ హుస్సేన్‌లను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పేరుతో ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఐదుగురు తమ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు (ఏది ముందయితే అది) పదవిలో ఉంటారు. వీరిలో కట్టా శేఖర్ రెడ్డి నమస్తే తెలంగాణ ఎడిటర్ ఎడిటర్‌గా ఉండగా, మైదా నారాయణరెడ్డి టీ న్యూస్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ మొహ్మద్ అమీర్ హుస్సేన్ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ. కేసీఆర్ సేవాదళ్ పేరుతో సామాజిక సేవ చేస్తున్నారు. పార్టీ తరఫున నిర్వహించే రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూ ఉంటారు. సయ్యద్ ఖలీలుల్లా వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన పేరును ఎంఐఎం ప్రతిపాదించినట్టు తెలిసింది.

ఆర్టీఐ కమిషనర్ల నియామకపు ఉత్తర్వులు


తెలంగాణ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కమిషన్‌లో ఖాళీగా ఉన్న కమిషనర్ల నియామకాల కోసం ఈనెల 7న ప్రభుత్వం ఓ సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఈ కమిటీ 9వ తేదీన ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమై చర్చించింది. ఈ రోజు కమిషనర్లను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 10, 2020, 8:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading