నేడు తెలంగాణ గవర్నర్ ప్రజాబాట... బీజేపీ వ్యూహం అదేనా?

Telangana : తెలంగాణలో నరసింహన్ స్థానంలో తమిళిసైని గవర్నర్‌గా నియమించినప్పుడే టీఆర్ఎస్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆ పార్టీ ఊహించినట్లే బీజేపీ... ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోందా?

news18-telugu
Updated: December 9, 2019, 6:00 AM IST
నేడు తెలంగాణ గవర్నర్ ప్రజాబాట... బీజేపీ వ్యూహం అదేనా?
గవర్నర్ తమిళిసై
  • Share this:
Telangana : ఎక్కడైనా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాబాటలకు వెళ్తుంటారు. ఒక్కోసారి ప్రతిపక్షాలు పాదయాత్రలు చేస్తుంటాయి. తెలంగాణలో మాత్రం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్... నేటి నుంచీ ప్రజా బాటకు వెళ్తున్నారు. మూడు రోజులపాటూ... 4 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ ప్రజా బాటలో భాగంగా ఆమె ఆలయాల్ని సందర్శిస్తారు, ప్రాజెక్టుల్ని పరిశీలిస్తారు, గిరిజనులతో మాట్లాడతారు, రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా నేటి టూర్‌లో యాదాద్రి, వరంగల్ అర్బన్ జిల్లాలకు ఆమె వెళ్లబోతున్నారు. రేపు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయానికి వెళ్తారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలోని కార్యక్రమాల్లో పాల్గొని... అదే రోజు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ బయల్దేరతారు. ఈ టూర్‌కి సంబంధించి బీజేపీ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఐతే... ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే యాత్రే. ఎందుకంటే... ఇప్పటికే సీఎం కేసీఆర్... రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల వద్దకు రావట్లేదనీ, ఎంతసేపూ ప్రగతి భవన్‌లోనే ఉంటున్నారనీ, అసెంబ్లీకి వెళ్లట్లేదనీ ఇలా ఎన్నో విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇలాంటి సమయంలో... ముఖ్యమంత్రి కంటే గవర్నరే బెటర్ ప్రజల వద్దకు వస్తున్నారు అనే ఆలోచన ప్రజల్లో కలిగేలా చెయ్యాలన్నది బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. పైకి ఇది ఫ్రెండ్లీ ప్రజా బాటగానే కనిపిస్తున్నా... తెరవెనక అంతా బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమే అంటున్నారు విశ్లేషకులు.

తెలంగాణలో టీఆర్ఎస్ ఒక్క నీటి ప్రాజెక్టులు తప్ప ఇంకేమీ చేసింది లేదనీ, వాటిలో కూడా అవినీతి జరిగిందని బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో గవర్నర్... ప్రజా బాట పేరుతో ప్రాజెక్టుల సందర్శన చేపట్టినప్పుడు... ఆటోమేటిక్‌గా కొంతమందైనా గిరిజనులు.... ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసే అవకాశాలుంటాయి. అలాంటి అంశాల్ని గవర్నర్ లేవనెత్తితే... అది కేసీఆర్ సర్కారుకు ఇబ్బంది కలిగిస్తుంది. అలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ హైకమాండ్... గవర్నర్ ద్వారా ఈ ప్రజా బాట వ్యూహాన్ని అమలు చేయిస్తున్నట్లు పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. 2023 లేదా 2024లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ... ఈ ప్రజా బాటను అందులో ఓ కీలక అడుగుగా భావిస్తున్నట్లు సమాచారం.

Pics : క్యూట్ సింగర్ షిర్లీ సెషియా అందాలు
ఇవి కూడా చదవండి :

నేడు లోక్‌సభలో పౌరసత్వ బిల్లు... ఆమోదం కోసం బీజేపీ విప్ వ్యూహం

పాము కనిపిస్తే అది విషపూరితమైనదో కాదో గుర్తించడం ఎలా?Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు

Published by: Krishna Kumar N
First published: December 9, 2019, 6:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading