గతంలో ఎవరు సహాసం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.ఈ ప్రాంతంలోని ఆదివాసి గిరిజనులు, గూడాల్లోని చెంచుల ఆర్ధిక, మరియు సామాజిక స్థితిగతులను ఆమె స్వయంగా తెలుసుకోనున్నారు.. ఆదివాసిలు ఎక్కువగా ఉన్న మన్ననూర్ ఐటిడీఏ పరిధిలోని మహబుబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వికారారాబాద్తో పాటు చెంచులు, గిరిజనులు ఎక్కువగా జీవిస్తున్నారు. కాగా ఈ ప్రాంతాల్లో 45 గుడాల్లో మొత్తం 9వేల మంది గిరిజనులు జీవిస్తున్నట్టు సమాచారం. స్వాతంత్య్రం తర్వాత నేటి వరకు వారి జీవితాల్లో వెలుగులు నిండిన పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.. వారు అడవిని వదలి బయటకు రాలేని స్థితిలో ఉండడంతో అభివృద్దికి దూరంగా ఉన్నారు..
https://twitter.com/i/status/1507633227913039875
ఈ క్రమంలోనే నేడు నల్లమల పర్యటనకు వెళ్లిన గవర్నర్ నాగర్‌కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనతో పాటు ఉపాధికోసం ఏర్పాటు చేసిన టైలరింగ్‌ను గవర్నర్ స్వయంగా పరిశీలించారు. అంతకుముందు హరిత హోటల్‌కు చేరుకున్న గవర్నర్‌కు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.