సైన్స్& టెక్నాలజీలో రాణించాలి.. యువతకు గవర్నర్ తమిళిసై పిలుపు

ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం మనదని.. మానవ వనరులను సరైన రీతిలో వినియోగించుకుంటే మన మనదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని తమిళిసై చెప్పారు.

news18-telugu
Updated: June 10, 2020, 7:23 PM IST
సైన్స్& టెక్నాలజీలో రాణించాలి.. యువతకు గవర్నర్ తమిళిసై పిలుపు
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
  • Share this:
కరోనాపై జరుగుతున్న పోరాటంలో భారతీయ పరిశోధకులే ముందు వరుసలో ఉన్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. దేశ యువత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణించాలని ఆమె పిలుపునిచ్చారు. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు దేశీయ సాంకేతికతతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు గవర్నర్. చెన్నైలోని రాజ్యలక్ష్మి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బుధవారం జరిగిన 9వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై వర్చువల్ మోడ్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనందరం విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

ప్రతి సంక్షోభం కొత్త అవకాశాలను అందిస్తుంది. వాటిని మనం అందిపుచ్చుకోవాలి. సృజనాత్మకంగా ఆలోచించి దేశ సేవకు ఉపయోగపడేలా చేయాలి. వర్చువల్ గ్రాడుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొనడం కొత్త అనుభూతిని ఇచ్చింది. వర్చవల్ ఇప్పుడు రియాలిటీగా మారింది. ఇది ఇప్పుడు సర్వ సాధారణమైంది.
తమిళిసై సౌందర్ రాజన్, తెలంగాణ గవర్నర్


భారతీయ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే మూడో అతి పెద్దదని తమిళిసై సౌందర్ రాజన్ అభిప్రాయపడ్డారు. అమెరికా, చైనా తర్వాత ఇక్కడే అత్యధిక మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారని చెప్పారు. ఐతే యూనివర్సిటీల్లో అందించే విద్యలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు తమిళిసై. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం మనదని.. మానవ వనరులను సరైన రీతిలో వినియోగించుకుంటే మన మనదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. తమకు నచ్చిన రంగంలో రాణించి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని యువతకు సూచించారు. తద్వారా భారత్‌ను గ్లోబల్ నాలెడ్జ్ సూపర్‌ పవర్‌గా మార్చాలని ప్రధాని మోదీ కలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.
First published: June 10, 2020, 7:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading