Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    బాలకృష్ణకు బర్త్ డే విషెస్ తెలియజేసిన గవర్నర్ తమిళసై..

    నందమూరి నట సింహా బాలకృష్ణ  ఈ నెల 10న తన షష్టి పూర్తి చేసుకున్నారు. నందమూరి బాలకృష్ణకు తెలంగాణ గవర్నర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

    news18-telugu
    Updated: June 12, 2020, 9:05 AM IST
    బాలకృష్ణకు బర్త్ డే విషెస్ తెలియజేసిన గవర్నర్ తమిళసై..
    బాలకృష్ణకు బర్త్ డే విషెస్ తెలియజేసిన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ (Facebook/Photo)
    • Share this:
    నందమూరి నట సింహా బాలకృష్ణ  ఈ నెల 10న తన షష్టి పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తన తోటి నటులు చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్ వంటి నటులతో పాటు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సహా పలువురు ప్రముఖు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. తాజాగా బాలకృష్ణకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ విషయాన్ని బాలకృష్ణ తన ఫేస్‌బుక్ వేదికగా అభిమానులకు తెలియజేసారు. మరోవైపు బాలయ్య.. తనకు వివిధ మాధ్యమాల ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రస్తుతం బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘BB3’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.
    Published by: Kiran Kumar Thanjavur
    First published: June 12, 2020, 9:05 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading