హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Budget : తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోదం.. ప్రభుత్వానికి ఉపశమనం

Telangana Budget : తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోదం.. ప్రభుత్వానికి ఉపశమనం

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (File Image)

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (File Image)

Telangana Budget : రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య వివాదాన్ని కాసేపు పక్కన పెట్టడంతో.. తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. ఈ ప్రకారం.. బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ కొద్దిగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Telangana Budget : 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. నిన్న పుదుచ్చేరిలో ఉన్న ఆమె... ఈ రోజు ఉదయమే బడ్జెట్‌ని ఆమోదించినట్లు తెలిసింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఐతే.. నిన్న హైకోర్టులో చెప్పిన ప్రకారం.. ఈసారి గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభం అవుతాయి. ముందుగా అనుకున్నట్లుగానే.. ఫిబ్రవరి 3న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కానీ బడ్జె్ట్‌ని మాత్రం ఫిబ్రవరి 6న ప్రవేశపెడతారు. ఈసారి 3 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జె్ట్ రూపొందినట్లు తెలిసింది.

నిజానికి ఈ నెల 21నే బడ్జెట్‌ని ఆమోదం కోసం గవర్నర్ చెంతకు పంపగా... తన ప్రసంగం ఉంటుందా లేదా అని ఆమె ప్రశ్నించగా.. దానిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. దాంతో ఆమె బడ్జెట్‌ని ఆమోదించలేదు. నిన్న హైకోర్టులో ఆమె ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో... గవర్నర్ కూడా శాంతించారు.

కొంతకాలంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య రాజకీయ వివాదాలు కొనసాగుతున్న విషయం మనకు తెలుసు. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నా.. బడ్జెట్ విషయంలో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వెయ్యడంతో.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా రాజీ పడి.. బడ్జె్ట్‌ని ఆమోదించారని తెలుస్తోంది. ఇది కాకుండా మిగతా అంశాల్లోనూ ఇలాగే సానుకూలంగా ఉంటారా లేక.. పట్టుదలతో ఉంటారా అనేది త్వరలో తెలుస్తుంది.

First published:

ఉత్తమ కథలు