తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు బీర్సా ముండా జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నిర్వహించే జన జాతి గౌరవ దినోత్సవ వేడుకలో గవర్నర్ పాల్గొననున్నారు. పర్యటనటో బాగంగా కేస్లాపూర్ లో కొలువున్న గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ సమీపంలో దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇక గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్.పి. రాజేష్ చంద్ర, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్, పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు ఈ రోజు కేస్లాపూర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కొమురం భీం విగ్రహానికి రంగులు వేయాలని, ఆ పరిసరాలను శుభ్రపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాగోబా దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించి పూజా కార్యక్రమాల నిర్వహణపై వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉట్నూర్ లోని కొమురం భీం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ ను సందర్శించారు. గవర్నర్ బస చేసే విశ్రాంతి గదులను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరారు.
ఇది చదవండి : ముఖానికి నల్లరంగు పూసి.. గుండు కొట్టించారు.. అక్కడ ప్రేమించడమే. తప్పు....?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.