• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA GOVERNOR TAMILISAI SOUNDAR RAJAN FACILITATE PADMASRI WINNER KANAKARAJU MS ADB

Telangana: పద్మశ్రీ కనక రాజు తో కలిసి గుస్సాడి ఆడిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై...

Telangana: పద్మశ్రీ కనక రాజు తో కలిసి గుస్సాడి ఆడిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై...

గవర్నర్ తో కనకరాజు..

రాజ్ భవన్ లోని సంస్కృతి భవన్ లో ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కనక రాజు ను గవర్నర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    గుస్సాడి నృత్య కళతో గోండుల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పి పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక రాజు ను తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అభినందించారు. రాజ్ భవన్ లోని సంస్కృతి భవన్ లో ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కనక రాజు ను గవర్నర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనక రాజు సంప్రదాయ వాయిద్యాల నడుమ కళాకారులత కలిసి గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. గవర్నర్ తమిళ సై సౌందర రాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన కళాకారులతో కలిసి కొద్దిసేపు గుస్సాడి నృత్యం చేశారు.

    అనంతరం కనక రాజుకు గవర్నర్ పది వేల రూపాయల పారితోషకాన్ని, మిగిలిన కళాకారులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున 20 మందికి 20 వేల రూపాయలను అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ తరఫున ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.



    ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందర రాజన్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను గుర్తించేలా భారత ప్రభుత్వం గుస్సాడి కళాకారుడుకు కనక రాజును పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ పురస్కారాన్ని గిరిజనులు వారి సంస్కృతికి దక్కిన గౌరవంగా భావించాలన్నారు. త్వరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలలో పర్యటిస్తానని మార్లవాయి గ్రామానికి ఖచ్చితంగా వస్తానని హామి ఇచ్చారు.

    ఈ సందర్భంగా మార్లవాయి గ్రామస్తులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ యూత్ ఆధ్వర్యంలో గవర్నర్ తమిళిసై కి వినతి పత్రాన్ని అందజేశారు. తమ మార్లవాయి గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తిర్చిదిద్దాలని, ఆదివాసీల ఆత్మ బందువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ , బెట్టి ఎలిజబెత్ దంపతుల వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఇదిలా ఉంటే ఒకరోజు ముందు హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా కనక రాజు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు