హోమ్ /వార్తలు /తెలంగాణ /

Governor Tamilisai: నన్ను ఆ ఐఏఎస్​ అధికారి గుర్తుపట్టకపోవడం బాధ కలిగించింది: గవర్నర్​ తమిళిసై

Governor Tamilisai: నన్ను ఆ ఐఏఎస్​ అధికారి గుర్తుపట్టకపోవడం బాధ కలిగించింది: గవర్నర్​ తమిళిసై

గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

ప్రతి అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టి వివాదం సృష్టిస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వాపోయారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సౌత్ ఫస్ట్ వెబ్ పోర్టల్‌ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరయ్యారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రతి అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టి వివాదం సృష్టిస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ (Governor Tamilisai Soundararajan) వాపోయారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ హోటల్‌లో సౌత్ ఫస్ట్ వెబ్ పోర్టల్‌ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరయ్యారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో గవర్నర్ల సమావేశానికి 10 మంది గవర్నర్లు హాజరు కాగా.. అక్కడున్న ఓ ఐఏఎస్ (IAS) అధికారి తనను గుర్తించకపోవడం బాధ కలిగించిందని తమిళిసై పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ నేతల వల్ల ఉన్నత పదవుల్లో ఉన్న తనలాంటి వ్యక్తులకు గుర్తింపు ఉండటం లేదని గవర్నర్  ఆవేదన వ్యక్తం చేశారు.

  దీనికి కారణం అధికారులపై రాజకీయ నేతల ప్రభావమేనని గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు .. తానూ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినేనని తమిళిసై స్ఫష్టంచేశారు.  రాష్ట్రాలు కేంద్రంతో కలిసికట్టుగా పని చేసి దేశాభివృద్ధికి పాటుపడాలని గవర్నర్ తమిళిసై కోరారు.

  అంతకుముందు గురువారం తెలంగాణ విమోచన దినోత్సవ సంబురాలలో గవర్నర్​ మాట్లాడుతూ..  స్వాతంత్య్ర సమరయోధులను.. వారి త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఎన్నో కష్టాలు పడిన హైదరాబాద్‌ వాసులు.. నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం పొందడంతో విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.

  కేంద్రానికి పిర్యాదు చేస్తూనే..

  తెలంగాణలో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ అంతకంతకూ పెరిగిపోతోంది. కొద్దిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కేటీఆర్ సహా పలువురు కౌంటర్ ఇచ్చారు. ఇక ఆ తరువాత రాష్ట్రానికి వచ్చి భద్రాచలం సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు గవర్నర్ తమిళిసై. అయితే అక్కడ కూడా అధికారులు గవర్నర్ విషయంలో ప్రోటోకాల్‌ను సరిగ్గా పాటించలేదనే విమర్శలు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో పర్యటించే విషయంలో ప్రోటోకాల్ వంటి వ్యవహారాలను పట్టించుకోవద్దని గవర్నర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ సహా వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రానికి పిర్యాదు చేస్తూనే.. రాష్ట్రంలో తాను చేయాల్సిన పనులు, పర్యటనలు చేసుకుంటూ వెళ్లాలనే యోచనలో గవర్నర్ తమిళిసై ఉన్నారని చర్చ జరుగుతోంది.

  Good news to farmers: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్​ శుభవార్త.. పూర్తి వివరాలివే

  ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏవి అమలు చేయడం లేదనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది బీజేపీ . మరోవైపు అధికార టీఆర్ఎస్‌ కూడా అంతే స్థాయిలో కేంద్రం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోంది. ఆర్దికసాయం, సంక్షేమ పథకాలకు నిధులివ్వడంలో వివక్ష చూపుతోందనే వాయిస్‌ని గట్టిగా వినిపిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్‌ పరస్పర విమర్శలు చేసుకుంటున్న టైమ్‌లోనే గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్‌ ప్రభుత్వ పాలన, కేసీఆర్‌ తీరును విమర్శిస్తూ మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు.   ప్రోటోకాల్​ సరిగా పాటించడం లేదంటూ గవర్నర్​ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Governor Tamilisai, Hyderabad, Uttar pradesh

  ఉత్తమ కథలు