హోమ్ /వార్తలు /తెలంగాణ /

Govenor Tamilisai: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీపై గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Govenor Tamilisai: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీపై గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (File Image)

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (File Image)

Telangana News: విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ కాంగ్రెస్ నేతలతో అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ‌ అంశంపై తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై అన్నింటిని పరిశీలిస్తున్నట్టు వారికి తెలిపారు. ఈ విషయంలో రాజ్యాంగ బాధ్యతలకు లోబడే పని చేస్తానని ఆమె తెలిపారు. కాంగ్రెస్(Congress) నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ కాంగ్రెస్ నేతలతో అన్నారు. సిరిసిల్లలో (siricilla)ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ఘటనను గవర్నర్ వారి దగ్గర ప్రస్తావించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డాు.

టీఏస్‌పీఏస్సీ పేపర్ లీక్ లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని అన్నారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే కీలకపాత్రని ఆరోపించారు. కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్‌కు అప్లికేషన్ పెట్టామన్నారు. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామన్నారు.

ఇప్పుడున్న టీఏస్‌పీఏస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించామని.. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని విమర్శించారు.

TS News: రిజిస్ట్రేషన్ చేలేదా.. పెట్రోల్ పోసి చంపేస్తాం.. ఎమ్మార్వోకి బెదిరింపులు

Bhatti Vikramarka: తెలంగాణ తెచ్చుకుందే అందుకు..పీపుల్స్ మార్చ్ యాత్రలో భట్టి కీలక వ్యాఖ్యలు

కేటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు అప్లికేషన్ ఇచ్చామన్నారు. దీనిపై లీగల్ ఓపినీయన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి కాంగ్రెస్ నేతలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవర్నర్.. ఈ వ్యవహారంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా ? అన్నది చూడాలి.

First published:

Tags: Telangana, TSPSC Paper Leak

ఉత్తమ కథలు