news18-telugu
Updated: September 3, 2019, 5:06 PM IST
గవర్నర్ నరసింహన్(ఫైల్ ఫోటో)
తెలంగాణ గవర్నర్ నరసింహన్ తన పదవీవిరమణ నేపథ్యంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చిట్టచివరి గవర్నర్ గానూ, విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలకు తొలి గవర్నర్‌గానూ కొనసాగిన నరసింహన్, తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు శాఖను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే, పరిస్థితి అదుపు తప్పనీయకుండా వ్యవహరించారని నరసింహన్ గుర్తు చేసుకున్నారు. భాష్పవాయు గోళాలు, వాటర్ కేనాన్స్ వంటి తక్కువ హాని కలగించే సాధనాలతోనే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్ర విభజన సమయంలో తనను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమంటూ మీడియా సృష్టించిందని నరసింహన్ పేర్కొన్నారు. ఉద్యమసమయంలో పోలీసు అద్భుతంగా పనిచేశారని, అదుపు తప్పకుండా సంయమనంతో మెలిగారని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతతో మెలిగాయని, లేకపోతే పరిస్థితి అదుపుతప్పేదని నరసింహన్ పేర్కొన్నారు.
Published by:
Krishna Adithya
First published:
September 3, 2019, 5:06 PM IST