Nizamabad : నిజామాబాద్ లో ఎంపీ అర్వింద్ పై జరిగిన దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. ఫోన్లో విషయాన్ని తెలుసుకున్నారు.. మరోవైపు ఎంపీపై దాడి మరోసారి లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి చేరింది. దీంతో సంఘటనపై విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.
ఎంపీ ఆర్వింద్ పై దాడి చేస్తారని డీజీపీ మహేందర్ రెడ్డికి, సీపీ నాగరాజు, ఇంటిలిజెన్స్ అధికారులకు తెలిసిన పోలీసులు రక్షణ కల్పించలేదని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ సీపీ నాగరాజు డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ గుండాలు దాడికి పాల్పడ్డారని, హత్యాయత్నం చేశారని ఆరోపించారు. పిబ్రవరి 3 న ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో వారి సంగతి తెలుస్తామన్నారు.. ఆర్మూర్ ఘటనను కూడా ప్రివిలేజ్ కమిటీకి పిర్యాదు చేస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పాటు ఉంటుందని జోస్యం చెప్పారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు చట్టం పరిధిలో పని చేయాలని, చట్టంకు వ్యతిరేకంగా పని చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు..
రాష్ట్రంలో కొంత మంది ఐపీఎస్ లు, ఐఏఎస్ లు అసంతృప్తిలో ఉన్నారని, కొంత మంది అధికారులు సీఎం కేసీఆర్ మోకాలి చిప్ప నీళ్లు త్రాగుతున్నారని చెప్పారు. గణతంత్ర దినోత్సవం వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరుకాకపోవడం రాజ్యాంగ పదవులను అవమానపర్చడమే అన్నారు.. ఎమ్మెల్యేలు, మంత్రులు హద్దులలో ఉండి అభివృద్ధికి పాటుపాడాలని తెలిపారు. సీఎం కేసీఆర్ కు మానవత్వం ఉంటే సీపీ పై కేసు నమోదు చేసి,ఎంపీ పై హత్యాయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ డిప్రెషన్ కు వెళ్లారని అందుకే బీజెపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. పార్లమెంట్ పరిధిలో తిరిగేహక్కు ఎంపీలకు ఉంటుందని, అలాంటిదే వారికి రక్షణ లేకుంటే ఎలా ఉంటుందన్నారు. కరీంనగర్ లో నాపై పోలీసులు దాడి చేశారు. ఎప్పుడు ఎంపీ అర్వింద్ పై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.. తెలంగాణ ప్రజలు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు.. ఈ సారి బీజెపీకి అవకాశం కల్పించాలని భావించడంతో బీజెపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ఊరుకోమని రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో మా ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలని చెప్పారు.
పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి కి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్ చేశారని... ఫోనులో గవర్నర్ దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారని ఎంపీ అర్వింద్ చెప్పారు.. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోలీస్ లు తీరును ఎంపీ వివరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో తన హత్యకు ప్లాన్ జరిగిందని, దాడి జరిగే అవకాశం ఉందని ముందు రోజు, మరుసటి రోజు తెలిపినా, రౌడీ మూకలను అదుపు చేసే ప్రయత్నం జరగలేదని చెప్పారు.తన స్వంత నియోజక వర్గంలో పోలీస్ లు కనీస భద్రత కల్పించలేదు అని గవర్నర్ కు తెలిపారు.
ఈ మధ్య కాలంలో గౌరవ పార్లమెంట్ సభ్యులపై, ఇతర ప్రజా ప్రతినిధులపై పోలీసుల సమక్షంలోనే, కొన్ని సార్లు పోలీసులే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ విషయమై తెలంగాణ డీజీపీ తో, కేంద్ర హోమ్ శాఖతో చర్చించి, తగు చర్యలకు సూచిస్తానని హామీ ఇచ్చారని ఎంపీ అర్వింద్ చెప్పారు..
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.