తెలంగాణ గవర్నర్ తమిళిసై సహా పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రముఖులు..

Happy Birhday Pawan Kalyan | ఈ రోజు టాలీవుడ్ హీరో జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ 49వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు.

news18-telugu
Updated: September 2, 2020, 9:49 PM IST
తెలంగాణ గవర్నర్ తమిళిసై సహా పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రముఖులు..
పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై (Twitter/Photo)
  • Share this:
ఈ రోజు టాలీవుడ్ హీరో జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ 49వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ మీరు ఆయురాగోగ్యాలతో భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ట్వీట్ చేసారు.
మరోవైపు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయనతో దిగిన ఫోటోను ట్వీట్ చేసారు. అంతేకాదు భగవంతుడు పవన్ కళ్యాణ్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసారు.


మరోవైపు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్.. పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ట్వీట్ చేసారు.


మరోవైపు పవన్ కళ్యాణ్ అన్నయ్య.. కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి మన తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే... మార్గాలు వేరైనా గమ్యం ఒక్కడే. తన గుండె చపుడు ఎపుడు జనమే తన ఆశయం ఎల్లప్పుడూ జన హితమే. జనసేనానిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.


మరోవైపు మహేష్ బాబు.. కూడా పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపుతూ.. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాట్టు విషెస్ తెలియజేసాడు.మరోవైపు మెగా బ్రదర్  నాగబాబు, రామ్ చరణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసారు.

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


ఈ సందర్భంగా  ఓ లేఖను కూడా విడుదల చేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. రాజకీయాలతో పాటు ‘వకీల్ సాబ్’ మూవీతో పాటు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 2, 2020, 9:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading