పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభంపై కేసీఆర్ సర్కార్ క్లారిటీ

Telangana: ఆన్‌లైన్, దూరవిద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిన్న కేబినెట్ నిర్ణయించిందని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

news18-telugu
Updated: August 6, 2020, 4:57 PM IST
పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభంపై కేసీఆర్ సర్కార్ క్లారిటీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకటి రెండు రోజుల్లో పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం ఎప్పుడనే విషయాన్ని ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆన్‌లైన్ తరగతులు నిషేధించాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. ఆన్‌లైన్, దూరవిద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిన్న కేబినెట్ నిర్ణయించిందని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రైవేట్ స్కూళ్ల విధివిధానాలు ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. మార్చిలోనే ప్రారంభించినట్టు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ చెబుతున్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యాశాఖ పరిధి స్కూళ్లకే వర్తిస్తుందా ? అని ప్రశ్నించింది.

Telangana, Telangana High cout, Academic year, Schools opening in telangana, తెలంగాణ, తెలంగాణ హైకోర్టు, విద్యా సంవత్సరం, తెలంగాణలో స్కూల్స్ ప్రారంభం
తెలంగాణ హైకోర్టు


కొన్ని స్కూళ్లు గంటల తరబడి ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాయని కోర్టు పేర్కొంది. 5వ తరగతి లోపు విద్యార్థులు గంటల తరబడి ఆన్‌లైన్‌లో ఎలా ఉంటారు ? అని ప్రశ్నించింది. పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించింది. ఫీజుల జీవోను స్కూళ్లు ఉల్లంఘిస్తున్నాయన్న పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు... ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను 27కి వాయిదా వేసింది.
Published by: Kishore Akkaladevi
First published: August 6, 2020, 4:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading