హోమ్ /వార్తలు /తెలంగాణ /

Financial Budget 2022: ఐఐఎం ఇవ్వరు.. స్టీల్​ ప్లాంట్​ పరిశీలించరు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోరు.. కేంద్ర బడ్జెట్​పై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి..

Financial Budget 2022: ఐఐఎం ఇవ్వరు.. స్టీల్​ ప్లాంట్​ పరిశీలించరు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోరు.. కేంద్ర బడ్జెట్​పై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి..

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

ఐఐఎం, బయ్యారం స్టీల్​ ప్లాంట్​, ఉద్యానవన వర్సిటీ, మెగాటెక్స్​టైల్​కు నిధులు​ తదితర డిమాండ్లు ఏళ్లుగా చేస్తున్న కేంద్రం దగ్గరి నుంచి స్పందన రావడం లేదు. బడ్జెట్​లో వాటికి నిధులు పెద్దగా కేటాయించడం లేదు.

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ 2022‌‌‌‌ -23 మంగళవారం ఆర్థిక బడ్జెట్ (Financial Budget 2022)​ను ప్రవేశపెట్టారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎంతో ఆతృతగా భారీ నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్న ప్రతీసారి తెలంగాణ (Telangana)కు మొండిచేయి ఎదురవుతూనే ఉంది. ఐఐఎం, బయ్యారం స్టీల్​ ప్లాంట్ (Bayyaram Steal Plant)​, ఉద్యానవన వర్సిటీ, మెగాటెక్స్​టైల్​కు నిధులు​ తదితర డిమాండ్లు ఏళ్లుగా చేస్తున్న కేంద్రం దగ్గరి నుంచి స్పందన రావడం లేదు. బడ్జెట్​లో వాటికి నిధులు పెద్దగా కేటాయించడం లేదు. ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోరుతూ ప్రతీసారి కేంద్రం వంక చూస్తోంది. అయితే కేంద్రం తెలంగాణ డిమాండ్లను పెద్దగా పట్టించుకోలేదు.

  కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో మౌలిక సదుపాయాల కోసం..

  వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి (Development of backward areas)కి సంబంధించిన రూ.900 కోట్లు బకాయిలు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన రూ.817.61 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంటును విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్‌  (Demand)చేసింది. సీఎస్​ఎస్​ల బకాయిలు రూ.495.20 కోట్లను సర్దుబాటు చేయాలని కోరింది. ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను విడుదల చేయాలని, వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో మౌలిక సదుపాయాల కోసం రూ.897.92 కోట్లను మంజూరు చేయాలని డిమాండ్‌ చేసింది. అయితే కేంద్ర మాత్రం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) డిమాండ్లు పెద్దగా పట్టించుకోలేదు.

  కనీసం ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని..

  బయ్యారంలో స్టీల్‌ ప్లాంటు (Bayyaram Steal Plant)ను ఏర్పాటు చేయాలని కొన్ని రోజులుగా కేంద్రాన్ని తెలంగాణ కోరుతూ వస్తోంది. బీబీనగర్‌లోని ఎయిమ్స్‌  (AIIMS)కు, గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయాలకు కేంద్ర బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని రాష్ట్రం డిమాండ్‌ చేసింది. కరీంనగర్‌లో ఐఐఎం ఏర్పాటు, వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్‌ పార్కు (Mega Textile Park)కు నిధుల కేటాయింపును కేంద్రం పట్టించుకోలేదు. అలాగే.. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజె క్టుల్లో కనీసం ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని ప్రతిపాదించింది. కానీ కేంద్రం.. వీటిని అసలు పరి గణనలోకే తీసుకోలేదు. కాగా, సిరిసిల్ల మెగా పవర్‌ లూం క్లస్టర్‌కు సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.

  హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రాజెక్టు (Hyderabad Pharmacy Project)కు కేంద్ర బడ్జెట్‌లో దాదాపు రూ. 5వేల కోట్లను కేటాయించాలని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. దీనికి నేషనల్‌ ఇన్వెస్ట్మెంట్​ మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌(నిమ్జ్‌) హోదా ఇవ్వడానికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపిందని గుర్తు చేసింది. ఈ ఫార్మాసిటీకి రూ.64,000 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు దాదాపు 5.6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించింది. అయినా.. కేంద్ర బడ్జెట్‌లో దీని ప్రస్తావన లేదు.

  జాతీయ రహదారులకు కొత్త ఊపు..

  గత ఏడాదికాలంలో తెలంగాణ రాష్ట్రంలో 3,306 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అందులో 2,168 కి.మీ. మేర రోడ్లకు అనుమతులు మంజూరు చేసింది. ఇంకా 1,138 కి.మీ. రోడ్లకు సంబంధించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. వాటిల్లో రీజినల్‌ రింగురోడ్డులోని ఉత్తర భాగానికి పచ్చజెండా ఊపింది. దక్షిణ భాగమైన చౌటుప్పల్‌–ఆమన్‌గల్‌–షాద్‌నగర్‌–కంది రోడ్డుకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Aiims, Budget 2022-23, Financial Planning, Telangana

  ఉత్తమ కథలు