తెలంగాణలో ఈ-పాలన... సోమవారం ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు....

టెక్నాలజీని వాడుకోవడంలో ఎంతో ముందున్న తెలంగాణ ప్రభుత్వం... ఈ-పాలన విషయంలోనూ అదే స్పీడ్‌తో ఉంది. ఇక రాష్ట్రమంతా ఆన్‌లైన్ కాబోతోంది.

news18-telugu
Updated: July 11, 2020, 8:08 AM IST
తెలంగాణలో ఈ-పాలన... సోమవారం ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు....
తెలంగాణలో ఈ-పాలన... సోమవారం ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు....
  • Share this:
కాగితంతో పనిలేకుండా పాలన సాగించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు అనుకుంటున్నా... అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు కరోనా కారణంగా... పూర్తిస్థాయి ఈ-పాలన రాబోతోంది. సోమవారం ఈ-పాలనను ప్రారంభిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా... దాన్ని సీఎం కేసీఆర్... డిజిటల్ ఫార్మాట్‌లో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చూస్తారు. అలాగే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పేపర్‌తో పనిలేకుండా... అంతా ఆన్‌లైన్ రూపంలో జరుగుతాయి. సంప్రదాయ సంతకాల స్థానంలో డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటాయి. చర్చలు, సమావేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే. ఏ ఫైలైనా... ఆన్‌లైన్ పరమే. ఏ నిర్ణయమైనా... డిజిటల్‌లోనే. అన్నింటికీ పక్కా ఆధారాలుంటాయి. పూర్తి పారదర్శకమైన పాలన రాబోతోంది.

ప్రజలు పెట్టుకునే అర్జీలు, ప్రతిపాదనలన్నీ స్కాన్ అవుతాయి. సంబంధిత కలెక్టర్లేట్లకు ఆన్‌లైన్‌లో వెళ్తాయి. తద్వారా కలెక్టరేట్లు, మండల, డివిజన్, ఇతర ఆఫీసుల్లో ఈ-పాలన అమలవుతుంది. తహశీల్దార్, MPDO, RDO, DPO ఇలా విభాగాలన్నీ... ఆన్‌లైన్‌లోనే ఫైళ్లను చెక్ చేసి... ఆమోదిస్తాయి. అంటే ప్రజలు ఇచ్చే అర్జీలు పేపర్ల రూపంలో ఉన్నా... ప్రభుత్వం మాత్రం వాటిని ఆన్‌లైన్ స్కానింగ్ ప్రతుల రూపంలోనే చూడనుంది.

దీని వల్ల చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఏ ఫైల్ ఏ దశలో ఉందో క్షణాల్లో తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు... ఇంట్లో ఉండి కూడా... ఫైళ్లను ఆన్‌లైన్‌లో తెరచి చూసి... ఓకే చెయ్యొచ్చు. అలాగే... ఏదైనా ఫైల్ కోసం గంటల తరబడి వెతకాల్సిన అవసరం ఉండదు. క్షణాల్లో అది సెర్చ్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. ఏ ఫైల్ ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందో తెలుసుకొని... సంబంధిత అధికారిని వెంటనే పని పూర్తి చెయ్యమని సీఎం ఆఫీస్ వర్గాలు కోరే అవకాశాలున్నాయి. అందువల్ల పని వేగం పెరుగుతుంది. అలాగే... పనిలో కచ్చితత్వమూ ఉంటుంది. కాలయాపన తగ్గుతుంది.

పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా అన్ని జిల్లాలు, ఆఫీసుల్లో డిజిటల్ కాన్ఫరెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అలాగే... ఫైళ్లను బార్ కోడింగ్ చేస్తారని తెలిసింది.

ఇకపై ప్రతి సోమవారం ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో DDRC సమావేశాలు నిర్వహించనుంది. నీటి ప్రాజెక్టుల పనుల్లో అభివృద్ధి, ప్రభుత్వ సహాయ చర్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అన్ని అంశాల్నీ సీఎం కేసీఆర్... పరిశీలిస్తారు. ఏ జిల్లాలో ఏ లోటుపాట్లున్నా... వెంటనే వాటిని సరిచేస్తారు. అంతా ఆన్‌లైన్ అయినప్పటికీ... కేబినెట్ సమావేశాలు, తీసుకునే నిర్ణయాలపై మాత్రం సీక్రెసీ మెయింటేన్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే... శాఖల వారీగా... ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇవ్వనున్నారు. తద్వారా... సమాచార భద్రతకు ఎలాంటి లోటూ లేకుండా చేయనున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 8:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading