తెలంగాణలో రైతు సమన్వయ సమితి పేరు మార్పు...

తెలంగాణలో 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టీఆర్‌ఎస్‌ను గెలిపించారని కేటీఆర్ తెలిపారు.

news18-telugu
Updated: March 2, 2020, 12:36 PM IST
తెలంగాణలో రైతు సమన్వయ సమితి పేరు మార్పు...
తెలంగాణ రాష్ట్రం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు సమన్వయ సమితి పేరు త్వరలోనే మారనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. త్వరలోనే రైతు సమన్వయ సమితి పేరును రైతు బంధు సమితిగా మార్చనున్నట్టు ఆయన వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు మరోసారి తిరుగులేని విజయాన్ని అందించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టీఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పారు.

తెలంగాణలో రైతు సమన్వయ సమితి పేరు మార్పు... | Telangana government to rename rythu samanvaya samaiti announced ktr ak
తెలంగాణ మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)


కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో దాని ప్రభావం కొంత తక్కువగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ రైతుపక్షపాత ప్రభుత్వమని... రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని వివరించారు. రైతు సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదని... రుణమాఫీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే రైతు రుణమాఫీ జరుగుతుందని... రైతులెవరూ రుణమాఫీపై ఆందోళన చెందవద్దని అన్నారు. డీసీసీబీ ఛైర్మన్ల ఎన్నికల్లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చామని... రైతాంగ సమస్యలపైన ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.
Published by: Kishore Akkaladevi
First published: March 2, 2020, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading