ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గింపు... ప్రయాణికులకు ఇబ్బందులు

లాభాలు రాని రూట్లలో కూడా ఆర్టీసీ బస్సులు నడుపుతూ ఉంటుంది. ఐతే... తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని మార్పులు చేసింది. హైదరాబాద్‌లో 800 బస్సుల్ని రద్దు చేసేసింది. జిల్లాల్లోనూ తగ్గించబోతోంది.

news18-telugu
Updated: January 25, 2020, 6:06 AM IST
ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గింపు... ప్రయాణికులకు ఇబ్బందులు
ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గింపు... ప్రయాణికులకు ఇబ్బందులు
  • Share this:
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యకపోయినా... ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా బస్సుల సంఖ్యను బాగా తగ్గిస్తోంది. హైదరాబాద్‌లో పాత డొక్కు బస్సుల్ని పక్కన పెడుతోంది. ఐతే... ఆ బస్సుల స్థానంలో కొత్త బస్సులు రావట్లేదు. ఫలితంగా 800 బస్సులు తగ్గిపోయాయి. అందువల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటం రొటీన్ సీన్. ఇక ఇప్పుడు పల్లెల్లో 1280 బస్సుల్ని కూడా లేపేయబోతున్నారు. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సుల కొరత తప్పదు. ముఖ్యంగా ఉదయం వేళ రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు సమయానికి బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తూ... డబ్బులు ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తోంది.

ప్రజల నుంచీ వచ్చే డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని... రద్దైన బస్సుల స్థానంలో అద్దె బస్సుల్ని తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2100 అద్దె బస్సులున్నాయి. కొత్తగా 1334 బస్సులు మరో 15 రోజుల్లో రాబోతున్నాయి. అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఇవి రాబోతున్నాయి. హైదరాబాద్‌లో కొత్తగా రాబోయే అద్దె బస్సులు 54 మాత్రమే. తీసేసిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల్ని తేవచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. ప్రభుత్వం కొత్త బస్సుల్ని కొనే ఆలోచనలో లేదు. ఆర్టీసీలో అంత డబ్బు లేదంటోంది. అందుకే అద్దె బస్సులకు ఛాన్స్ ఇస్తున్నట్లు చెబుతోంది. ఐతే... ఆర్టీసీకే కలిసిరానప్పుడు అద్దె బస్సుల ఓనర్లు ఆయా రూట్లలో, ఆయా సమయాల్లో ఆ బస్సుల్ని తిప్పుతారా అన్నది సందేహమే.

తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికీ విపరీతంగా బస్సుల కొరత ఉంది. చాలా పల్లెల్లో బస్సు ఫెసిలిటీ లేదు. కొన్నింటికి ఉన్నా... ఎప్పుడో ఒక బస్సు వస్తూ ఉంటంది. బస్సుల సంఖ్య పెంచాలనే ప్రతిపాదనలు ఉండగా... ప్రభుత్వం మాత్రం తగ్గించాలని నిర్ణయించడం షాకింగ్ విషయమే.

హైదరాబాద్ విషయానికి వస్తే... ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ప్రజలు సొంత వాహనాలు బయటకు తీశారు. సమ్మె తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచడంతో... అప్పుడు మెట్రో రైళ్లు ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆర్టీసీకి అలవాటు పడుతున్న టైంలో బస్సుల్ని తగ్గించేయడంతో... ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీని ప్రక్షాళన చేస్తూనే... తమకు ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. పాసులు ఉన్నా... బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో... తాము ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. బస్సులు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతోనే పాసులు తీసుకున్నామనీ... ఇప్పుడు బస్సుల్ని తగ్గిస్తే... ఆ ప్రభావం తమపై ఎక్కువగా పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు