తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సన్నాహాలు... టెక్నాలజీతో వేగంగా పని పూర్తి...

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణానికి రెడీ అవుతూ... పాత సచివాలయాన్ని కూల్చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది.

news18-telugu
Updated: July 1, 2020, 6:34 AM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సన్నాహాలు... టెక్నాలజీతో వేగంగా పని పూర్తి...
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సన్నాహాలు... టెక్నాలజీతో వేగంగా పని పూర్తి...
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయం ఉన్న ప్రదేశంలోనే కొత్త సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించాలని అనుకుంటోంది. అందుకే... ప్రస్తుత భవనాన్ని వేగంగా కూల్చేందుకు రెడీ అవుతోంది. ఓ వారంలో ఈ ప్రక్రియ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా ఈ పని వేగంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. దాంతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ రెడీ అయ్యింది. త్వరలో కేసీఆర్ సమక్షంలో జరిగే కేబినెట్ మీటింగ్‌లో ఏ రోజు కూల్చివేత మొదలుపెట్టాలో డిసైడ్ చేస్తారు. కూల్చివేత అనేది హంగామా ఏదీ లేకుండా ఫటాఫట్ అయిపోయేలా చెయ్యాలనుకుంటుండటంతో... 10 పెద్ద కంపెనీలు... కూల్చేస్తామని ముందుకొచ్చాయి. ఏ కంపెనీలు ఎలా కూల్చాలనుకుంటున్నాయో తెలిపాయి. అందువల్ల త్వరగా ఇది పూర్తి చేసి... శ్రావణమాసంలో కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం కూల్చివేతకు అవసరమైన రైట్ ఆఫ్ కోసం పంపాల్సిన ప్రతిపాదనను ఆర్ అండ్ బీ ఇంజనీర్ల టీమ్ రెడీ చేస్తోంది. రెండ్రోజుల్లో దీనికి క్లియరెన్స్ వచ్చే ఛాన్సుంది. ఆ వెంటనే టెండర్ల నోటిఫికేషన్ జారీ అవుతుంది.

సచివాలయాన్ని కూల్చే సమయంలో... చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఇబ్బంది కలగకుండా... అలాగే... చుట్టూ ఉన్న రోడ్డుపై వెళ్లే వాహనాలకు ఆటంకం కలగకుండా ఈ ప్రక్రియ జరగాలని ప్రభుత్వం కోరుతోంది. ముఖ్యంగా శిథిలాల వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యా రాకుండా చూడాలంటోంది. అందువల్ల అత్యంత ఆధునిక పద్ధతుల్లో ఈ ప్రక్రియ జరుపుతారని తెలిసింది. ముందుగా... భవనంలోని డోర్లు, కిటికీలు, ఫ్రేమ్‌లను తొలగిస్తారు. ఆ తర్వాత సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీతో... క్షణాల్లో భవనాన్ని కూల్చేస్తారని తెలిసింది.

కొత్త సెక్రటేరియట్ మరింత పెద్దగా, మరింత విశాలంగా... అత్యంత ఆధునిక టెక్నాలజీని మేళవిస్తూ నిర్మించనున్నట్లు తెలిసింది. దీనిపై వచ్చే కేబినెట్ మీటింగ్‌లో చర్చిస్తారని సమాచారం. ఈ నిర్మాణానికి దాదాపు రూ.500 కోట్లు అవుతుందనే అంచనా ఉంది. కొత్త భవనం ఎలా ఉంటే బాగుంటుందో ఓ 10 కంపెనీలు... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. జులై నెలాఖరులో ఈ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందనే అంచనా ఉంది.

ఇప్పుడున్న సచివాలయం 1981 నాటిది. ఇందులో సీ-బ్లాక్‌ను 1978లో అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రారంభించారు. మొత్తం ఆరు అంతస్థుల భవనం. 1998 ఆగస్ట్ 10న అప్పటి సీఎం చంద్రబాబు... ఏ బ్లాక్ ఫేజ్ 2ను ప్రారంభించారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి... డి బ్లాకును ప్రారంభించారు. ఇలా 25 ఎకరాలలో ఇది ఉంది. గత సీఎంలంతా ఇందులోనే ఉండేవారు. సీఎం కేసీఆర్ మాత్రం ప్రగతిభవన్‌ నిర్మించి... అందులో నుంచి పాలన సాగిస్తున్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మించాక... దాని నుంచి పాలన సాగించే అవకాశాలు ఉన్నాయి.
First published: July 1, 2020, 6:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading