కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఇంటికే..

ప్రారంభంలో వీరికి ఏలాంటి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కన్పించకపోయినా రెండు రోజుల వ్యవధిలోనే జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు స్వలంగా బయటపడుతున్నాయి.

news18-telugu
Updated: July 11, 2020, 10:42 AM IST
కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఇంటికే..
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొదట్లో కరోనా సోకిన వారిని ప్రభుత్వమే ప్రత్యేకంగా ఆస్పత్రిలో ఉంచి చికిత్సను అందించింది. అయితే పాజిటివ్ కేసులు అధికంగా నమోదు కావడంతో ప్రైవేటులోనూ చికిత్స చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు సూచనల మేరకు ఇంటిలోనే ఉండి కరోనా వైరస్ చికిత్స తీసుకోవచ్చని తెలిపింది. దీంతో ఆస్పత్రులకు వెళ్లి లేనిపోని వ్యాధులను కొని తెచ్చుకునే బదులు.. హోంఐసోలేషన్‌లోనే ఉండి కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10వేల మందికి పైగా ఇంటిలో ఉండి కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రారంభంలో వీరికి ఏలాంటి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కన్పించకపోయినా రెండు రోజుల వ్యవధిలోనే జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు స్వలంగా బయటపడుతున్నాయి. దీంతో వారందరికి ఉచితంగా కరోనా కిట్లను సరఫరా చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.

ఈ కిట్లతో 17 రోజులకు సరిపోయే మెడిసన్‌ను అందించనున్నారు. ఈ కిట్లలో మాస్కులు, శానిటైజర్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసెటమాల్, యాంటిబయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లు, ఎసిడిటీ తగ్గించే టాబ్లెట్లతో పాటు ఏం చేయాలో.. ఏం చేయకూడదనేటువంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ఓ పుస్తకం సైతం అందులో ఉండనున్నాయి. వీటి ఆధారంగా కరోనా సోకిన పెషంట్లు సులువుగా చికిత్స పొందేందుకు అవకాశం చిక్కనుంది.
Published by: Narsimha Badhini
First published: July 11, 2020, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading