హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్‌లో చేప ప్రసాద పంపిణీకి తేదీలు ఖరారు..ఎప్పుడంటే..

హైదరాబాద్‌లో చేప ప్రసాద పంపిణీకి తేదీలు ఖరారు..ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పోలీసు శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్, బ్యారికేడింగ్, సిసిటీవిల ఏర్పాట్లు చేయాలన్నారు తలసాని. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగు ప్రాధాన్యం ఇవ్వలన్నారు. అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

    వర్షా కాలం ఆరంభంలో హైదరాబాద్‌లో ఇచ్చే చేప ప్రసాదం ఎంతో ఫేమస్..! ఏటా లక్షలాది మంది ఆస్తమా రోగులు నగరానికి వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. ఇక ఈసారి కూడా చేప ప్రసాదానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 8,9న ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. చేప ప్రసాద పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్భంది ఏర్పాట్లు చేపట్టాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.


    బత్తిని హరినాధ్ గౌడ్ కుటుంబీకులు 173 ఏళ్లుగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశముంది. గత సంవత్సరం కంటె మెరుగ్గా ఏర్పాట్లు చేయాలి. జూన్ 8 సాయంత్రం 6 గంటల నుండి 9 సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ జరుగుతుంది.
    తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి


    తలసాని శ్రీనివాస్ యాదవ్


    చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి తో కలిసి మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, ఫైర్ సర్వీసెస్ డిజి గోపికృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్, ఫిషరీస్ కమీషనర్ సువర్ణ, TSSPDCL CMD రఘుమారెడ్డితో పాటు బత్తిని హరినాధ్ గౌడ్ కుటుంబీకులు పాల్గొన్నారు.


    పోలీసు శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్, బ్యారికేడింగ్, సిసిటీవిల ఏర్పాట్లు చేయాలన్నారు తలసాని. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగు ప్రాధాన్యం ఇవ్వలన్నారు. అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. జిహెచ్ఎంసి ద్వారా పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్స్, 5 రూపాయల భోజనం, అదనపు సిబ్బంది, రోడ్లకు రిపేర్లు చేపట్లని ఆదేశించారు. ఆర్టీసి ద్వారా ఎయిర్ పోర్ట్స్, బస్ స్టాండ్స్, రైల్వేస్టేషన్ల లతో పాటు వివిధ ప్రాంతాలనుండి 150 బస్ లను నడుపుతున్నట్లు తెలిపారు తలసాని. క్షేత్ర స్ధాయిలో పనుల పరిశీలనకు జూన్ 4 వ తేది ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశం అవుతామని వెల్లడించారు.

    First published:

    Tags: Fish medicine, Hyderabad, Monsoon, Telangana

    ఉత్తమ కథలు