• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA GOVERNMENT TO DISTRIBUTE 2ND TERM RATION FROM TODAY BS

రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ నేటి నుంచే.. కందిపప్పు కూడా..

రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ నేటి నుంచే.. కందిపప్పు కూడా..

ఒకటి, రెండు రోజుల్లో నేరుగా రేషన్ డీలర్ల ఖాతాలో జ‌మ‌కానుంద‌ని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

నేటి నుంచే రెండో విడత ప్రారంభం కానుంది. ఆహారభద్రత కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ఒక్కోకార్డుపై రూ.1500 నగదు అందించనుంది.

  • Share this:
    లాక్‌డౌన్ దెబ్బకు కూలీలు, పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని, రూ.1500 అందజేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో బియ్యం, నగదు అందజేసిన ప్రభుత్వం, మరోసారి అందించేందుకు సిద్ధమైంది. నేటి నుంచే రెండో విడత ప్రారంభం కానుంది. ఆహారభద్రత కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ఒక్కోకార్డుపై రూ.1500 నగదు అందించనుంది. అయితే, నిజామాబాద్‌, నల్లగొండ, వరంగల్‌ రూరల్‌, మెదక్‌ జిల్లాల్లో ప్రతీ కార్డుదారుడికి కిలో కందిపప్పును కూడా పంపిణీ చేయనున్నారు. నాఫెడ్‌ ద్వారా రాష్ట్రానికి నెలకు 8,754 టన్నుల కందిపప్పు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 3,233 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో ముందుగా నాలుగు జిల్లాల్లో పంపిణీ చేసి.. మిగిలిన 29 జిల్లాల్లో 15 వ తేదీ తర్వాత పంపిణీ చేయనున్నారు.

    కాగా, రూ.1500 నగదును బ్యాంకు ఖాతాల్లో పడని వారికి పోస్టాఫీసు ఖాతాల్లో జమచేయనున్నారు. మే 1న బ్యాంకులకు సెలవు కావడంతో 2వతేదీనుంచి ఈ నగదును జమ చేయనున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    అగ్ర కథనాలు