పౌల్ట్రీ ఫారాలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్

Telangana : తెలంగాణలో పౌల్ట్రీ ఫారాలు ఎక్కువే. కోళ్ల పెంపకం, అమ్మకం ఎక్కువ కాబట్టి... చాలా మంది ఫారాలు పెట్టుకున్నారు. మరి కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి?

news18-telugu
Updated: December 3, 2019, 5:50 AM IST
పౌల్ట్రీ ఫారాలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
Telangana : ఏ ప్రభుత్వానికైనా... రాష్ట్రంపై పూర్తి పట్టు ఉండాలి. అన్ని విషయాలూ ప్రభుత్వానికి తెలిసే జరగాలి. ఐతే... తెలంగాణలో కోళ్ల ఫారాల విషయంలో అలా లేదు. ఎవరికి వారు స్వయంగా కోళ్ల ఫారాలు పెట్టుకొని... జీవనం సాగిస్తున్నారు. ఐతే... కోళ్ల పెంపకం, ఎగుమతి, గుడ్ల ఉత్పత్తి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి కంట్రోల్ లేకుండా పోతోంది. ఇది కరెక్టు కాదనుకున్న ప్రభుత్వం ఇకపై ఎవరుబడితే వాళ్లు కోళ్ల ఫారాలు పెట్టేసుకోవడానికి వీల్లేకుండా కొత్త రూల్స్ తెచ్చింది. ఎవరైనా సరే... కోళ్లఫారం పెట్టుకొని ఒక్క కోడిని పెంచాలన్నా సరే... తప్పనిసరిగా ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త పౌల్ట్రీ విధానం తెస్తోంది. ఇది పౌల్ట్రీ రైతులకు ఇబ్బంది కలిగించేలా పైకి కనిపిస్తున్నా... లోపల అసలు విషయం వేరే ఉంది. కోడిగుడ్లకు మద్దతు ధర, ప్రత్యేక కరెంటు సబ్సిడీ టారిఫ్, సబ్సిడీపై కోళ్లకు దాణా కోసం మొక్కజొన్నల పంపిణీ ఇలాంటి అనుకూల అంశాలు ఈ విధానంలో ఉన్నాయి. దీని సంగతి ఫైనల్ చెయ్యమని సీఎం కేసీఆర్ ఓ కేబినెట్ సబ్ కమిటీని వేశారు. ఆల్రెడీ ఈ కమిటీ ఓసారి కూర్చొని తాజా పరిస్థితిపై చర్చించింది. పేద రైతులకు సబ్సిడీపై పెరటి కోళ్లు (అవో రకం) ఇవ్వాలని డిసైడైంది. అంతే కాదు పౌల్ట్రీకి సంబంధించి ఓ కోర్స్ కూడా తేవాలని అనుకుంటున్నారు. ఓవరాల్‌గా ప్రస్తుతం తెలంగాణలో ఎన్ని పౌల్ట్రీ ఫారాలున్నాయి? చిన్నవి ఎన్ని, పెద్దవి ఎన్ని ఈ డీటెయిల్స్ సేకరించి అప్పుడు ఈ నెల 13 మళ్లీ కూర్చొని... ఫైనల్‌గా కొత్త పౌల్ట్రీ విధానాన్ని అమల్లోకి తేవాలని అనుకున్నారు. కాబట్టి పౌల్ట్రీ ఫారం పెట్టాలనుకునేవారు ఓసారి ప్రభుత్వ ప్రతినిధులను వివరాలు అడిగి... ముందుకు వెళ్తే... తర్వాత ఏ సమస్యా ఉండదు.

 

అందాల టాప్ గేర్ వేస్తున్న టాక్సీవాలా బ్యూటీ
ఇవి కూడా చదవండి :

పేదలకు ఇళ్లపై జగన్ ప్రభుత్వం కొత్త రూల్స్... వెంటనే అప్లై చెయ్యండి

Nutrition In Fish : చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే...Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...

Health Tips : ముల్లంగి తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...

Health : రోజూ 5 నిమిషాలు పరిగెడితే... కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Published by: Krishna Kumar N
First published: December 3, 2019, 5:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading