• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA GOVERNMENT SUPPORTS CHENNAMANENI RAMESH BABU REGARDING HIS CITIZENSHIP CONTROVERSY CASE AK KNR

Telangana: ఎమ్మెల్యే చెన్నమనేని తప్పులేదు.. పౌరసత్వంపై కేసీఆర్ సర్కార్ అఫిడవిట్

Telangana: ఎమ్మెల్యే చెన్నమనేని తప్పులేదు.. పౌరసత్వంపై కేసీఆర్ సర్కార్ అఫిడవిట్

చెన్నమనేని రమేశ్(ఫైల్ ఫోటో)

Telangana: హోంశాఖ తన ఉత్తర్వుల్లో కేవలం సెక్షన్ 10.2ను మాత్రమే ఉటంకిస్తున్న సందర్భాన్ని తెలంగాణ ప్రభుత్వం తాము సమర్పించిన అఫిడవిట్‌లో తప్పు పట్టింది.

  • Share this:
    వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారంపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పౌరసత్వం వ్యవహారంలో ఆయన తప్పేమీ లేదని అందులో పేర్కొంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు చేయాలంటే సెక్షన్ 10.3 వినియోగాన్ని హోంశాఖ నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం ఒక భారత దేశపౌరుని పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే అది ప్రజా శ్రేయస్సుకు సానుకూలంగా లేదని నిరూపించినప్పుడే అది వీలవుతుందని వెల్లడించింది. సెక్షన్ 10.2లో చట్టాల ఉల్లంఘన ప్రక్రియ పొందుపరిచిన నేపధ్యంలో సెక్షన్ 10.3లో అలాంటి ఉల్లంఘన తరుణంలో భారత పౌరసత్వాన్ని కొనసాగించడం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా లేదని నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే హోంశాఖ తన ఉత్తర్వుల్లో కేవలం సెక్షన్ 10.2ను మాత్రమే ఉటంకిస్తున్న సందర్భాన్ని తెలంగాణ ప్రభుత్వం తాము సమర్పించిన అఫిడవిట్‌లో తప్పు పట్టింది.

    చెన్నమనేని పౌరసత్వంపైన కేంద్ర హోంశాఖ జూలై 2017లో వేసిన కమిటీ రిపోర్టు ప్రకారం ఆయనకు ఎలాంటి నేర చరిత్ర గాని లేక ఎలాంటి క్రిమినల్ కేసులు గాని లేవని, ఆయనపై ఎలాంటి ఉగ్రవాద, తీవ్రవాద, గూఢాచారి లేక యుధ్ధ నేరారోపణలు గాని లేవని తేలిందని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ నేపధ్యంలొ చెన్నమనేనికి సెక్షన్ 10.3 వర్తిస్తుందని, హైకోర్టు 10.7.2019 తన తీర్పులో కూడా దీన్ని అక్షరాల ఆధారం చేసుకున్నారని తెలిపింది. చెన్నమనేని రమేశ్ ఏ వాస్తవాలు దాచలేదని.. ఎవరినీ తప్పుదోవ పట్టించలేదని వివరించింది. ఈ కేసుకు మూలం కేవలం రాజకీయ ప్రత్యర్ధి వరుస ఎన్నికల ఓటములే అని అభిప్రాయపడింది.
    Published by:Kishore Akkaladevi
    First published: