Home /News /telangana /

TELANGANA GOVERNMENT SPEEDUP PROCESS OF BRINGING BACK ITS EMPLOYEES FROM ANDHRA PRADESH AK

Telangana: ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు వెనక్కి.. ప్రక్రియ వేగవంతం

ఏపీ, తెలంగాణ మ్యాప్

ఏపీ, తెలంగాణ మ్యాప్

Telangana: డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, క్యాషియర్లు వంటి క్లాస్ 3 ఉద్యోగులు, అటెండర్లు, వాచ్ మెన్లు, జమేదార్, మెసెంజర్స్ మొదలగు క్లాస్ 4 ఉద్యోగులు కలిపి 698 మంది ఉద్యోగులను వెనక్కి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

ఇంకా చదవండి ...
    Telangana: ఏపీలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించిన ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇదే అంశానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రేమచంద్రా రెడ్డికి తెలంగాణా ఎస్ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్ రామకృష్ణా రావు లేఖ రాశారు. ఆప్షన్‌కు వ్యతిరేకంగా కమలనాథన్ కమిటీ ఏపీకి పంపిన క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను తెలంగాణా ప్రభుత్వం వెనక్కి తేనున్నట్లు వెల్లడించారు.

    డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, క్యాషియర్లు వంటి క్లాస్ 3 ఉద్యోగులు, అటెండర్లు, వాచ్ మెన్లు, జమేదార్, మెసెంజర్స్ మొదలగు క్లాస్ 4 ఉద్యోగులు కలిపి 698 మంది ఉద్యోగులను వెనక్కి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ జాబితాలో ఏపీ సచివాలయం నుంచి 180 మంది, హెచ్ఓడిల నుంచి మిగిలిన ఉద్యోగులు ఉన్నారు. అక్కడికి కేటాయించిన ఉద్యోగుల్లో ఇప్పటికే కొంతమంది చనిపోయారు. వాళ్ల స్థానంలో కంపాషనేట్ గ్రౌండ్స్‌లో నియామకమైన ఉద్యోగులను సైతం ఇక్కడికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

    ఇటీవల పీఆర్సీ సహా తమ సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే వెనక్కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత దీనిపై అధికారులు దృష్టి పెట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, Telangana employees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు