Telangana: అప్పటిలోగా తెలంగాణలో వ్యాక్సినేషన్ పూర్తి.. హైకోర్టుకు వివరించిన ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: ఇప్పటివరకు సుమారు రూ. 65 లక్షలు బాధితులకు వెనక్కి ఇప్పించామని డీహెచ్ శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు.

  • Share this:
    తెలంగాణలో రాబోయే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుందని రాష్ట్ర డీహెచ్( డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) శ్రీనివాసరావు హైకోర్టుకు వివరించారు. ప్రస్తుతం రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 41 లక్షల మందికి వ్యాక్సిన్ రెండు డోసుల వ్యాక్సిన్ అందించామని.. 17 లక్షల మందికి మొదటి డోసు వేసుకున్నారని హైకోర్టుకు వివరించారు. ఇంకా రాష్ట్రంలో మరో 2.18 కోట్ల మందికి టీకా ఇవ్వాల్సి ఉందని డీహెచ్ తెలిపారు. జులై 2 నాటికి కేంద్రం నుంచి మరో 17 లక్షల డోసులు రానున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కరోనా కేసులపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది. ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసిన అధిక ఛార్జీలు ఇప్పించారా ? అని ప్రశ్నించింది.

    రెండు వారాల్లో బాధితులకు సొమ్ము ఇవ్వాలని ఆదేశించామని గుర్తు చేసింది. ఇప్పటివరకు సుమారు రూ. 65 లక్షలు బాధితులకు వెనక్కి ఇప్పించామని డీహెచ్ శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. మిగతా బాధితులకు త్వరగా డబ్బులు ఇప్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 2.07కి తగ్గిందని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.

    రేపటి నుంచి కొత్తగా 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పని చేస్తాయని తెలిపింది. సలహా కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని.. దీనిపై వారంలో జీవో జారీ అవుతుందని డీహెచ్ శ్రీనివాసరావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 135 ఆస్పత్రులపై 223 ఫిర్యాదులు వచ్చాయని.. 22 ఆస్పత్రుల లైసెన్సులు పునరుద్ధరించామని తెలిపారు. కోర్టుకు విచారణకు డీహెచ్ శ్రీనివాసరావుతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ కూడా హాజరయ్యారు.
    Published by:Kishore Akkaladevi
    First published: