Telangana: నల్లగొండ జిల్లాకు మరో గుడ్ న్యూస్.. మూడు కొత్త ప్రాజెక్టులు.. ఉత్తర్వులు జారీ

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR: నేడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

 • Share this:
  నల్లగొండ జిల్లాకు కొత్తగా మరో మూడు ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించిన రోజే.. ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన ఆదేశాలు రావడం విశేషం. కొత్త ఎత్తిపోతల పథకాల వివరాల్లోకి వెళితే... వేములపల్లి దగ్గర తోపుచర్ల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ. 9.3 కోట్లతో తోపుచర్ల ఎత్తిపోతలు నిర్మించాలని నిర్ణయించింది. దామరచర్ల మండలం తుంగపాడువాగుపై మరో ఎత్తిపోతల పథకానికి పచ్చజెండా ఊపింది.

  రూ. 32.22 కోట్లతో వీర్లపాలెం రెండోదశ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఇక కట్టంగూరు మండలం చెరువుఅన్నారం వద్ద అయిటిపాముల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రూ. 101.62 కోట్లతో అయిటిపాముల ఎత్తిపోతలకు అనుమతి ఇచ్చింది. ఇక సాగర్ నియోజకవర్గానికి కీలకంగా భావించే నెల్లికల్లు ఎత్తిపోతల పథకం డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. నెల్లికల్లు దగ్గర పంపింగ్ స్టేషన్ నిర్మాణం, ఇతర పనులకు అనుమతి ఇచ్చారు.

  గతంలో చేపట్టిన నెల్లికల్లు పనులకు ప్రీక్లోజర్ చేసి మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయంచారు. రూ. 664.80 కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతలకు కొత్తగా అనుమతులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన తెలంగాణ నీటిపారుదల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. నేడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
  Published by:Kishore Akkaladevi
  First published: