తహశీల్దార్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. ప్రత్యేక అధికారుల బాధ్యతల నుంచి తొలగింపు

కేసీఆర్ (File)

ప్రభుత్వం తమ విజ్ఞప్తిపై తక్షణం స్పందించనట్టయితే.. జులై 9 నుంచి 12వ తేదీ వ‌ర‌కు వ‌ర్క్ టు రూల్‌ పనిచేస్తామని తహశీల్దార్లు అల్టీమేటం జారీ చేశారు.

  • Share this:
    తెలంగాణ ప్రభుత్వం తహశీల్దార్లకు షాక్ ఇచ్చింది. నగర పంచాయితీలు,మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల బాధ్యతల నుంచి వారిని తప్పిస్తూ సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో ఎంపీడీవోలు బాధ్యతలు తీసుకోనున్నారు. తహశీల్దార్లకు వర్క్ టు రూల్ అమల్లోకి తెచ్చింది. అలాగే ఈ నెల 15 నుంచి సామూహిక సెలవులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తహశీల్దారు సంఘాల అల్టీమేటంను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బ‌దిలీ చేసిన త‌హ‌శీల్దార్ల‌ను తిరిగి పాత జిల్లాల‌కు బ‌దిలీ చేయాల‌ని తెలంగాణ త‌హ‌శీల్దార్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు సీఎస్ శైలేంద్ర జోషికి వినతి పత్రాలు అందించారు.

    ప్రభుత్వం తమ విజ్ఞప్తిపై తక్షణం స్పందించనట్టయితే.. జులై 9 నుంచి 12వ తేదీ వ‌ర‌కు వ‌ర్క్ టు రూల్‌ పనిచేస్తామని అల్టీమేటం జారీ చేశారు. అంటే, మొత్తం పనులన్నీ అయ్యేవరకు కాకుండా.. ఉద‌యం 10.30 గంటల నుంచి 5.00గంటల వ‌ర‌కు మాత్రమే ప‌ని చేసి.. ఆ తర్వాత నిరసన తెలుపుతామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే 15 నుంచి మాస్ లీవ్(సామూహిక సెలవులు) పెడుతామని హెచ్చరించారు. తహశీల్దార్ల హెచ్చరికలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. వారిని ప్రత్యేక అధికారుల బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    Published by:Srinivas Mittapalli
    First published: