TELANGANA GOVERNMENT RELEASES SALARIES FOR ANGANWADI EMPLOYEES ON THE OCCASION OF DUSSEHRA BS
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం దసరా కానుక..
అంగన్వాడీ ఉద్యోగులతో మంత్రి సత్యవతి రాథొోడ్
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండుగను పురస్కరించుకొని వారికి ముందే వేతనాలు చెల్లిస్తూ కానుక ఇచ్చింది. ఈ మేరకు రూ.83కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండుగను పురస్కరించుకొని వారికి ముందే వేతనాలు చెల్లిస్తూ కానుక ఇచ్చింది. ఈ మేరకు రూ.83కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రతి నెల చివర్లో వేతనాలు అందుతున్నాయి. అయితే, దసరా పండుగ నెల చివర్లో కాకుండా మొదట్లోనే రావడంతో పండుగ చేసుకోవడం ఇబ్బందిగా మారిందని.. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సంఘం నేతలు మంగళవారంనాడు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్‌ను కలిసి ముందే వేతనాలు ఇప్పించాలని కోరారు. దీంతో వారి విజ్ఞప్తిని ఆమె సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన సీఎం.. వారి వేతనాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటవెంటనే.. మంగళవారం రాత్రికే ఆర్థిక శాఖ జీవో కూడా విడుదల చేసింది.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అడిగిన వెంటనే అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలకు నిధులు విడుదల చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరుపితమైందని ఆమె అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారేనని చెప్పారు. మరోవైపు, ఈ నెల 21న హుజూర్ నగర్లో జరిగే ఉప ఎన్నికలో మహిళలు టీఆర్ఎస్వైపే ఉన్నారని, తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.