నేటి నుంచి బార్లు, క్లబ్బులు, పార్కులకు అనుమతి... ఇవీ కొత్త కండీషన్లు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడంతో... వెసులుబాట్లను ప్రభుత్వం పెంచుతోంది. శనివారం నుంచి బార్లు, క్లబ్‌లు, పార్కులు తెరవవచ్చని తెలిపింది. కొన్ని కండీషన్లు కూడా పెట్టింది.

news18-telugu
Updated: September 26, 2020, 6:43 AM IST
నేటి నుంచి బార్లు, క్లబ్బులు, పార్కులకు అనుమతి... ఇవీ కొత్త కండీషన్లు
నేటి నుంచి బార్లు, క్లబ్బులు, పార్కులకు అనుమతి...
  • Share this:
తెలంగాణలో ఇవాళ్టి నుంచి బార్‌లు, క్లబ్‌లు, టూరిజం బార్‌లు తెరచుకోనున్నాయి. అలాగే... అర్బన్ ఫారెస్ట్ పార్కులు కూడా ప్రారంభమైనట్లే. వీటికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా మార్చి 22న వైన్‌షాపులతో పాటు బార్‌లు, క్లబ్‌లను మూసి వేయించింది ప్రభుత్వం. క్లబ్‌లలో ఈవెంట్స్, డ్యాన్స్‌లకు అనుమతి ఇవ్వలేదు. తిరిగి ఆరు నెలల తర్వాత ఇప్పుడు బార్‌లు తెరచుకోవచ్చని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ మాత్రమే తెరచుకోవాలని ప్రభుత్వం కండీషన్ పెట్టింది. అంటే... బార్‌లు, క్లబ్‌లలో ప్రవేశ ద్వారం దగ్గరే కస్టమర్లకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌లు చేస్తారు. లోపలికి వెళ్లేప్పుడు తప్పని సరిగా క్యూ పద్ధతి పాటించాల్సి ఉంటుంది. లోపల అత్యంత పరిశుభ్రంగా ఉంచాలి. సేఫ్ డిస్టాన్స్ పాటించాలి. మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. పార్కింగ్‌ లాట్‌లలో క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ను అమలు చేయాలి. ప్రతి టేబుల్‌ దగ్గర హ్యాండ్‌ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలి. బార్‌ నిర్వాహకులు, సిబ్బంది తప్పని సరిగా మాస్క్‌లు వాడాలి. బార్లలో, క్లబ్బుల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర మూగడం, మ్యూజిక్‌ కార్యక్రమాలు, డాన్స్‌ ఫ్లోర్‌లు ఏర్పాటు చేయడం ఉండవు. కస్టమర్లు వచ్చేముందు ప్రతి బార్‌లోపల, బయటా ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చెయ్యాలి. బార్‌లలో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చెయ్యాలి. ఐతే... వైన్‌షాపుల దగ్గర నిర్వహించే పర్మిట్‌ రూమ్‌లకు మాత్రం ఆనుమతి లేదు. అవి మూసే ఉంచాలి.

telangana government, open bars, open clubs, urban forest parks, covid 19 rules, coronavirus guidelines, తెలంగాణ ప్రభుత్వం, బార్లు, పబ్బులు, క్లబ్బులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, కరోనా వైరస్, మార్గదర్శకాలు,
నేటి నుంచి బార్లు, క్లబ్బులు, పార్కులకు అనుమతి


కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో ఇవాళ్టి నుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ విషయం తెలిపారు. నగర పట్టణ వాసులు ఈ సదుపాయాల్ని వాడేసుకోవాలని సూచించారు. కరోనా రూల్స్ పాటిస్తూ సందర్శకులకు సానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించాలని అటవీ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అక్టోబర్ 6ను జూ డే కాబట్టి... ఆ రోజు నుంచి నెహ్రూ జూ పార్క్ లోకి సందర్శకులను అనుమతిస్తామని మంత్రి చెప్పారు. అందుకు తగ్గట్టుగా జూ పార్కు అధికారులు శుభ్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

telangana government, open bars, open clubs, urban forest parks, covid 19 rules, coronavirus guidelines, తెలంగాణ ప్రభుత్వం, బార్లు, పబ్బులు, క్లబ్బులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, కరోనా వైరస్, మార్గదర్శకాలు,
నేటి నుంచి బార్లు, క్లబ్బులు, పార్కులకు అనుమతి...


ఆరు నెలల పాటు క్లబ్బులు, బార్లను మూసివేసినందున మరో 6 నెలల పాటు లైసెన్సులను రెన్యూవల్ చేయాలని బార్లు, రెస్టారెంట్ల యజమానులు కోరుతున్నారు. ఆరు నెలలుగా బార్లు ఓపెన్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, నష్టాల్లో ఉన్నామని బార్ల యజమానులు తలిపారు. మే 6న మద్యం దుకాణాలను తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. మద్యం దుకాణాలను ఓపెన్ చేసే సమయంలో మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. తద్వారా... మద్యం షాపుల నిర్వాహకులకు కొంతవరకూ కలిసొచ్చేలా చేసింది. అదే విధంగా తమకూ కలిసొచ్చేలా చెయ్యాలని క్లబ్బులు, బార్ల నిర్వాహకులు కోరుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 26, 2020, 6:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading