Home /News /telangana /

TELANGANA GOVERNMENT ORDERED TO RELEASE TO RYTHU BANDHU FUNDS AK

తెలంగాణ రైతులకు శుభవార్త... రైతుబంధు నిధుల విడుదల

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రైతుబంధు పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం...ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతుబంధు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసింది. ఇందుకోసం రూ.6900 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిధులు విడుదలకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రైతుబంధు పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం...ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.

    దీంతో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఒక పంటకు రూ.5వేలు అందించనున్నారు. త్వరలో వర్షాకాల సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సాయాన్ని రైతులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం నిధుల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో... ఈ నెల రెండో వారంలో రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని విడుదల చేసే తేదీలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.




    First published:

    Tags: CM KCR, Rythu bandhu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు