ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల జీతాలపై... ప్రభుత్వం సరికొత్త వాదన

కార్మికులు యాభై రెండు రోజులుగా సమ్మెలోనే ఉన్నారని, కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు.

news18-telugu
Updated: November 27, 2019, 1:18 PM IST
ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల జీతాలపై... ప్రభుత్వం సరికొత్త వాదన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల జీతభత్యాలపై ప్రభుత్వం హైకోర్టులో సరికొత్త వాదనలు వినిపించింది. పేమెంట్ ఆఫ్ పేజెస్‌ యాక్ట్ 7 ప్రకారం..ఒక రోజు విధులకు హాజరుకాకుంటే 8 రోజుల జీతం కట్ చేయొచ్చునని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. కార్మికులు యాభై రెండు రోజులుగా సమ్మెలోనే ఉన్నారని, కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. మరోవైపు జీతాలు అందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తక్షణమే సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించే విధంగా.. ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

అక్టోబర్ 5 నుంచి 52 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకుండా నిలిపేసింది ప్రభుత్వం. ఆర్టీసీ యాజమాన్యం దగ్గర కార్మికులకు జీతాలు చెల్లించేంత సొమ్ము లేదని ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తూ వచ్చింది. తాజాగా పేమెంట్ ఆఫ్ పేజెస్‌ యాక్ట్ 7 ప్రకారం..ఒక రోజు విధులకు హాజరుకాకుంటే 8 రోజుల జీతం కట్ చేయొచ్చునని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించడం విశేషం.
First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>