హోమ్ /వార్తలు /తెలంగాణ /

సీఎం కేసీఆర్ నిర్ణయం.. వేలాది ఆర్టీసీ కార్మికులు ఇంటికే..?

సీఎం కేసీఆర్ నిర్ణయం.. వేలాది ఆర్టీసీ కార్మికులు ఇంటికే..?

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని సీఎం కేసీఆర్ రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఉన్నతాధికారులకు సూచించిన విషయం తెలిసిందే. మంగళవారం ఆర్టీసీ పరిస్థితిపై రివ్యూ చేపట్టిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే సమగ్ర నివేదికతో రావాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని సీఎం కేసీఆర్ రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఉన్నతాధికారులకు సూచించిన విషయం తెలిసిందే. మంగళవారం ఆర్టీసీ పరిస్థితిపై రివ్యూ చేపట్టిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే సమగ్ర నివేదికతో రావాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

TSRTC : ఆర్టీసీ కార్మికులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం, లేదా.. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీంను అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కార్మికుల్లో 50 ఏళ్లు పైబడిన వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లు దాదాపు 20 వేల మంది దాకా ఉన్నట్లు అంచనా.

ఇంకా చదవండి ...

  ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితంగా సంస్థ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిందని, నష్టాన్ని భర్తీ చేయాలంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు.. 5100 రూట్లను ప్రైవేటుపరం చేస్తున్నారు ప్రకటించారు. ఈ రోజు, రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం కూడా తీసుకోనున్నారు. అయితే.. సగం ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగిస్తే సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంగతి ఏంటి? వాళ్ల పరిస్థితి ఏంటి? ఉపాధి ఏంటి? అన్నవే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలు. ప్రస్తుతం ఆర్టీసీలో 48వేల మంది కార్మికులు ఉన్నారు. అయితే.. ప్రైవేటీకరణ తర్వాత సంస్థకు అవసరమయ్యేది 24 వేల మంది మాత్రమే. మిగతా కార్మికులు సంస్థకు బరువే. మరి వాళ్ల సంగతి ఏంటి? అంటే.. వాలంటరీ రిటైర్మెంట్ స్కీం, లేదా.. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీంను అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కార్మికుల్లో 50 ఏళ్లు పైబడిన వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లు దాదాపు 20 వేల మంది దాకా ఉన్నట్లు అంచనా. వీళ్లందరికీ వీఆర్‌ఎస్ ఆఫర్ ఇచ్చి ఇంటికి పంపించేయాలని సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

  వీఆర్‌ఎస్ ఆఫర్‌ను తిరస్కరించే వాళ్లను ఉద్యోగాల్లోంచి తొలగించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం(సీఆర్‌ఎస్)ను కూడా అమలు పరిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. మిగతా ఉద్యోగులకు ఏ అవకాశాలు ఇస్తారు? ఏ దిశగా సీఎం అడుగులు వేస్తారు? అన్న ప్రశ్నలకు ఈ రోజు, రేపు జరిగే కేబినెట్ సమావేశమే సమాధానం చెప్పనుంది.

  కాగా, పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూస్తున్న పల్లెవెలుగు రూట్లను ప్రైవేటు చేతికి అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలస్తోంది. అయితే.. టికెట్ రేటును నిర్ణయించే, నియంత్రించేందుకు ఒక అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇది రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) పరిధిలో పనిచేయనుంది.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: CM KCR, Telangana, Telangana High Court, TSRTC Strike

  ఉత్తమ కథలు