హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణలోనూ పెరగనున్న మద్యం ధరలు ?

తెలంగాణలోనూ పెరగనున్న మద్యం ధరలు ?

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తూనే... వాటి ధరల పెంపు అంశంపై కూడా తెలంగాణ కేబినెట్‌ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

  తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగింపు, పలు జోన్లలో ఇచ్చే సడలింపులు సహా పలు అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. కేంద్రం ఇప్పటికే మే 17వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో... తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంట నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నెల 28 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అనేక రాష్ట్రాలు మద్యం అమ్మకాలను మొదలుపెట్టడంతో... తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

  అయితే మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తూనే... వాటి ధరల పెంపు అంశంపై కూడా కేబినెట్‌లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మద్యం విక్రయాలు కొనసాగిస్తున్న అనేక రాష్ట్రాల్లో మద్యం ధరలు పెరిగాయి. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు 70 శాతానికిపైగా మద్యం ధరలు పెంచగా, బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు 30 శాతం ధరలు పెంచాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే ఏపీ తరహాలో తెలంగాణ సర్కార్ కూడా మద్యం ధరలను 75 శాతం పెంచుతుందా లేక 50 శాతం లోపే ఆ పెంపును పరిమితం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Liquor shops, Telangana, Telangana cabinet, Wine shops

  ఉత్తమ కథలు