హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: సీబీఐకు ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ?

Telangana: సీబీఐకు ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ?

సుప్రీంకోర్టు, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సుప్రీంకోర్టు, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: ఇరుపక్షాల వాదన విన్న తెలంగాణ హైకోర్టు.. కేసును సీబీఐకు బదిలీ చేసింది. అయితే ఈ కేసును సీబీఐకు బదిలీ చేయడంపై సిట్ లేదా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకు బదిలీ చేసింది. సిట్ విచారణ సరిగ్గా లేదని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కేసును సీబీఐకు బదిలీ చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు వెలుగులోకి రావడంతో మొదటగా మొయినాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అయితే కేసు తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ (SIT) దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని నిందితులు హైకోర్టును ఆశ్రయిచడంతో కేసు పలు దఫాలుగా విచారణ చేపట్టింది.

కేసును సీబీఐకి(CBI) అప్పగించాలని నిందితులు.. సిట్ దర్యాప్తు సమగ్రంగా సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదన వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదన విన్న తెలంగాణ హైకోర్టు.. కేసును సీబీఐకు బదిలీ చేసింది. అయితే ఈ కేసును సీబీఐకు బదిలీ చేయడంపై సిట్ లేదా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున కేసును సీబీఐకు అప్పగించడం సరికాదని సిట్ వాదిస్తోంది. అయితే తెలంగాణ హైకోర్టు కేసును సీబీఐకు అప్పగించడంతో.. తీర్పుపై హైకోర్టులోనే మరోసారి అప్పీల్‌కు వెళుతుందా ? లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే హైకోర్టు తీర్పు కాపీ అందిన తరువాత దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మొదటి నుంచి ఈ కేసును సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కానీ తెలంగాణ సర్కార్ ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి దర్యాప్తులో భాగంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా ఈ కేసు సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలివ్వడంతో బిగ్ టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంది. అయితే హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీల్ కు వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

Breaking News: ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు సంచలన తీర్పు

Droupadi Murmu: మరోసారి సీఎం కేసీఆర్ డుమ్మా..రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్, మంత్రి

కాగా ఈ కేసులో ఇటీవల ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు నేడు నిందితునిగా ఉన్న నందకుమార్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. అయితే ఓ వైపు ఈడీ విచారణ ఇటు సీబీఐకి కేసు అప్పగించడంతో ఇంకెన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. అలాగే హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీల్ కు వెళ్లనుండడంతో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.

First published:

Tags: Supreme Court, Telangana

ఉత్తమ కథలు