Home /News /telangana /

Telangana: యాసంగిలో వ‌రి వ‌ద్దంటున్న ప్ర‌భుత్వం.. ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగు సాధ్య‌మేనా?

Telangana: యాసంగిలో వ‌రి వ‌ద్దంటున్న ప్ర‌భుత్వం.. ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగు సాధ్య‌మేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Problems in Alternative crops: ఉప్పుడు బియ్యం కొనుగోలు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతుల్లో యాసంగి పంట‌పై రంది పెరిగింది. ఈ నేప‌థ్యంలో అధికారులు ప్ర‌త్నామ్నాయ పంట‌లు వేసుకొంటే మేల‌ని చెబుతున్నా.. ఎన్నో స‌మ‌స్య‌ల‌ను రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నాయి.

ఇంకా చదవండి ...
  ఉప్పుడు బియ్యం కొనుగోలు ఉండదని  ప్రభుత్వం (Government) స్పష్టం చేయడంతో రైతుల్లో యాసంగి పంట‌పై రంది పెరిగింది. ఈ నేప‌థ్యంలో అధికారులు ప్ర‌త్నామ్నాయ పంట‌లు వేసుకొంటే మేల‌ని చెబుతున్నా.. ఎన్నో స‌మ‌స్య‌ల‌ను రైతుల‌ (Farmers)ను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఏం పంట వేయాలో తెలియ‌క పోవ‌డం. ఏం పంట వేస్తే కొంటారో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం. వ‌రి కొన‌ము అంటున్న ప్ర‌భుత్వాలు.. ఏం పంట వేస్తే కొంటాయో స్ప‌ష్ట‌త నివ్వ‌క‌పోవ‌డం రైతుల‌కు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఆయ‌క‌ట్టు ప్రాంతాల్లో భూములు వ‌రిక ఎక్కువ‌గా అనుకూలంగా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో ఇత‌ర పంట‌ల సాగు అంత సుల‌భం కాదు. అంతే కాకుండా ఇత‌ర పంట‌ల సాగుపై రైతుల‌కు అంత అవ‌గాహ‌న కూడా లేదు.

  అయితే ఆరుత‌డి పంట‌లు సాగు చేసే నేల‌ల్లో మాత్రం వరి (Rice) కాకుండా ఇత‌ర పంటలు వేసుకొనే అవ‌కాశం ఉంది. కానీ ప్ర‌స్తుతం ఏం పంట వేస్తే లాభ‌దాయ‌క‌మో అవ‌గాహ‌న కొర‌వ‌డిది. లాభ‌సాటి పంట తెలిసినా విత్త‌నాలు, సాగు విధానం, అవ‌స‌ర‌మై యంత్రాలు స‌మ‌కూర్చుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఇవ్వ‌న్ని జ‌ర‌గాలంటే అన్నిశాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల్సి ఉంటుంది.

  ఏం పంట‌లు మేలు..
  యాసంగిలో వేరుసెనగ, శెనగ, పెసలు, ఉల్లిగడ్డలు (Onions), ఆలుగడ్డలు, ఆవాలు, మినుములు, పొద్దుతిరుగుడు, ఇతర లాభదాయక పంటలవైపు మొగ్గుచూపితే మెరుగ్గా ఉంటుంద‌ని ప‌లు ప్రాంతాల్లో అధికారులు చెబుతున్నారు. అయితే వీటి కొనుగోలు ఎలా? మార్కెట్ ఉన్నా.. వీటిని ఎలా అమ్ముకోవాలో రైతులకు ఎవ‌రు చెబుతారు అనేది అతి పెద్ద స‌మ‌స్య‌.

  CM KCR Press Meet: ద‌మ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలి.. కిష‌న్ రెడ్డికి కేసీఆర్ స‌వాల్‌


  ప్ర‌భుత్వం ఏం చేయాలి..
  నిజానికి రైతులు ఏం పండిస్తున్నార‌నేది ముఖ్యం కాదు. పండించిన దానికి మార్కెట్ ఉందా.. ఆ పంట దేశీయ ఆహార అవ‌స‌రాల‌ను తీరుస్తుందా అనేది ముఖ్యం. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. రైతులు పంట వేయ‌క త‌ప్ప‌దు. కానీ పంట అమ్మ‌కానికి కావాల్సిన మార్కెట్ వ్య‌వ‌స్థ (Market System) ఇప్పుడు లేదు. ప్రభుత్వం వరి కొనుగోలు నుంచి త‌ప్పు కోవ‌డానికి కార‌ణాలు స‌రైన‌వే అయి ఉండొచ్చు. కానీ రైతుల‌కు స‌రైన అవ‌గాహ‌న. మార్కెట్ అవ‌కాశాల‌ను క‌ల్పించే బాధ్య‌త‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం మాత్రం ఉంది.

  Omicron: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఏమిటి?.. ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి


  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రైతులు పండించే పంట‌కు మేము బాధ్యులం కాదు అంటున్నాయి ప్ర‌భుత్వాలు. బాధ్య‌త తీసుకోకున్నా.. ఏం చేయాలి ఎలా చేయాలి అనే అంశం రైత‌లకు అవ‌గాహ‌న క‌ల్పించాలి. ఎందుకంటే ఒక్క‌సారిగా పంట పండించ‌కండి మేము కొనం అంటే.. ఏం పండించాలో తెలియ‌క‌.. పండించింది ఏం చేయాలో తెలియ‌క రైతులు ఇబ్బంది ప‌డే అవ‌కాశం ఉంది.   ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాలు రైతుల‌ను ప్ర‌త్నామ్నాయ పంట‌ల‌పై దృష్టి పెట్టేలా చేయ‌డం ఒక మార్గం.. అంతే కాకుండా రైతుల‌కు స్వ‌త‌హాగా పంట‌ను మార్కెట్ చేసుకొనే అవ‌గాహ‌న‌, సౌల‌భ్యం క‌లిగించ‌డంపై దృష్టి పెడితే దీర్ఘ‌కాలికంగా రైతుల‌కు మేలు చేసిన‌ట్టు అవుతుంది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Farmers, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు