Good News: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్... ఇ-అసెస్మెంట్ సెంటర్ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను చెల్లించే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అన్ని పట్టణాల్లో ఆస్తిపన్ను పైన ఐదు శాతం ఎర్లీ బర్డ్ ప్రోత్సహాకాన్ని ప్రకటించింది. దీంతో పాటు ఇప్పటిదాకా వార్షిక ఆస్తిపన్ను కేవలం రూ.30వేల వరకు ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్ను ఎంత ఉన్నప్పటికీ మే 31 లోపు పన్ను చెల్లిస్తే ఐదు శాతం ప్రోత్సాహాకం ప్రకటించింది. అయితే రెసిడెన్షియల్, కమర్షియల్ కేటగిరీల వారికి ఈ ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకం వర్తింపజేస్తున్నట్టు తెలిపింది. దీంతో పాటు ‘ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు’ పేరుతో సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Published by:
Narsimha Badhini
First published:
May 9, 2020, 2:51 PM IST