ప్రతిపక్షాలు ఐసోలేషన్‌లో ఉన్నయ్.. మేం రైతుల్లో ఉన్నామన్న హరీశ్‌రావు

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

రైతుల పక్షాన మేం పని చేస్తుంటే.. ప్రతిపక్ష నేతలు ఏసీ గదుల్లో కూర్చోని రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతుల నుంచి పంటలు కొనడం లేదని, తెలంగాణలో మాత్రం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని వివరించారు.

  • Share this:
    ప్రతిపక్షాలు ఐసోలేషన్‌లో ఉంటే.. మేం రైతుల్లో ఉన్నామని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో రంగంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల పక్షాన మేం పని చేస్తుంటే.. ప్రతిపక్ష నేతలు ఏసీ గదుల్లో కూర్చోని రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనా వచ్చిన కష్టకాలంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా పంటలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు గన్నీ సంచులు, లారీల సమస్య లేదని, కరోనా వల్ల దేశంలో ఏ రాష్ట్రంలో రైతుల నుంచి పంటలు కొనడం లేదని, తెలంగాణలో మాత్రం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు విమర్శలు, అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని తెలిపారు.

    కర్ణాటకలో ప్రభుత్వం శనగలు కొనుగోలు చేయడం లేదని, బీదర్ రైతులు నారాయణ ఖేడ్, జహీరాబాద్‌కు తెచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రమంతా లాక్‌డౌన్ ఉన్నా.. రైతులకు లేదని గుర్తు చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యముంటే ప్రజల్లో తిరగాలని, హైదరాబాద్‌లో కూర్చొని గవర్నర్‌కు వినతిపత్రాలు ఇస్తే సరిపోదన్నారు. సమావేశం అనంతరం మంత్రి హరీశ్‌రావు రంగంపేట నర్సరీని పరిశీలించారు.
    Published by:Narsimha Badhini
    First published: