హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Debt: మళ్లీ అప్పు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వచ్చే వారమే బాండ్ల వేలం!

Telangana Debt: మళ్లీ అప్పు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వచ్చే వారమే బాండ్ల వేలం!

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణ మరోసారి అప్పు చేయనుంది. తన ఖజానాకు మరో రూ.2 వేల కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా ఆమేరకు నిధులను సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరోసారి అప్పు (Debt) చేయనుంది. తన ఖజానాకు మరో రూ.2 వేల కోట్లు చేర్చుకోనుంది. బాండ్ల విక్రయం (Bons Selling) ద్వారా ఆమేరకు నిధులను సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  ఈ మేరకు వెయ్యి కోట్ల విలువైన బాండ్లను ఎనిమిదేండ్ల కాలానికి, మరో వెయ్యి కోట్ల విలువైన బాండ్లను తొమ్మిదేండ్ల కాలానికి జారీచేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ (RBI) వచ్చే మంగళవారం వేలం వేయనుంది. చివరిసారి ఆగస్టు 23న వెయ్యి కోట్లను రుణాల ద్వారా ప్రభుత్వం సమీకరించుకుంది. తాజాగా మరో రెండు వేల కోట్ల విలువైన బాండ్లను జారీచేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఆర్బీఎం పరిధికి లోబడి ప్రభుత్వం తీసుకొనే రుణాల మొత్తం రూ.18,500 కోట్లు అవుతుంది. వీటిని మూలధనం కింద ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని సర్కారు భావిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.53,970 కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి విమర్శలు..

  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitaraman) మూడు రోజుల పర్యటనకు తెలంగాణ వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ (CM KCR)పై విమర్శలు గుప్పించారు. కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన ఒక సభలో పాల్గొన్న మంత్రి సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర పథకాలకు తెలంగాణ పేర్లు మార్చి వాడుకుంటోందని సాధారణ విమర్శలు మొదలు పెట్టిన నిర్మల.. తెలంగాణ అప్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

  తెలంగాణ అప్పులు FRBM పరిధి దాటి పోతోందని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల్లోకి నెట్టేశారని అన్నారు. రాష్ట్రంలో అప్పుడే పుట్టినబాబు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్ధితి వుందని కేంద్ర మంత్రి అన్నారు. ఉపాధి హామీ పథకం కోసం 20 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. కేంద్రం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారని నిర్మల హెచ్చరించారు. ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందని.. తానే ప్రధాని అన్నట్లు కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని నిర్మల వ్యాఖ్యానించారు.

  అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. దేశం మొత్తం తిరిగే ముందు తమ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై సమాధానం చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందన్నారు

  ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారని.. లాభాల్లో వున్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారంటూ కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కటి అమల్లోకి రావాలని.. ప్రజలను భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్టుగా పెంచుతున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bank loans, Banks, Finance, Rbi, Telangana

  ఉత్తమ కథలు