Home /News /telangana /

TELANGANA GOVERNMENT IMPOSED RESTRICTIONS ON NEW YEAR CELEBRATIONS CLICK HERE TO KNOW WHAT CITIZENS CAN DO AND WHAT NOT TO DO PRV

Telangana restrictions on New year Celebrations: నేటి నుంచి జనవరి 2 వరకు తెలంగాణలో ఆంక్షలు.. ఉత్తర్వులనుసారం ఏమేం చేయొచ్చు.. ఏం చేయొద్దంటే..

file

file

ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో నేటి ( శనివారం) నుంచి జనవరి 2 వ తేదీ వరకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రంలో పౌరులు ఏం చేయొచ్చు... ఏం చేయకూడదనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం..

    భారత్​లో​ కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకూ (Omicron fears in India) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ (Telangana restrictions on New year Celebrations) నిర్ణయం తీసుకుంది . ఒమిక్రాన్ తీవ్రత పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు (New Covid rules in Telangana) తెలుస్తోంది. దీనికి తోడు తెలంగాణ హై కోర్టు కూడా ఆంక్షలు విధించాలని ఇటీవల సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం (Telangana restrictions on New year Celebrations) తీసుకున్నట్లు సమాచారం. కొవిడ్ ఆంక్షలపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కొవిడ్ ఆంక్షలు నేటి నుంచే (శనివారం) అమలులోకి వస్తాయని స్పష్టం (Covid restrictions) చేశారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల (Telangana restrictions on New year Celebrations) నేపథ్యంలో రాష్ట్రంలో పౌరులు (Citizens) ఏం చేయొచ్చు... ఏం చేయకూడదనే (what to do what not to do) విషయాలు ఒకసారి తెలుసుకుందాం..

    బహిరంగ సభలకు అనుమతి లేదు. వేడుకలకు అనుమతి ఉంది.

    సినిమాహాళ్లు, షాపింగ్​ మాల్స్​ తెరిచే ఉంటాయి. భౌతికదూరం తప్పనిసరి

    మాస్కు లేకపోతే షాపింగ్ మాల్స్​, సినిమా హాళ్లు, వేడుకలకు అనుమతి నిరాకరిస్తారు.

    పెళ్లిళ్లు, వేడుకలు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి

    గుంపులుగా వచ్చే అవకాశం ఉన్న ఏదైనా కార్యక్రమం, వేడుక, మాల్స్​ తదితర వాటిలో ప్రవేశ ద్వారం ముందు థర్మల్ స్క్రీనింగ్​ తప్పనిసరి ఏర్పాటుచేయాలి.

    ఎక్కడికెళ్లినా మాస్కు తప్పనిసరిగా ధరించాలి. ఒకవేళ ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తారు.

    అన్ని కార్యాలయాలు, బార్లు, పబ్​లు, ఆఫీసులు, జిమ్​లు, పార్కులు, కంపెనీలు తెరుచుకోవచ్చు.  ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలి.

    ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లవచ్చు. ప్రయాణాలపై ఎలాంటి నిబంధనలు లేవు.

    ఉదయం వేళ జాగింగ్‌, సైక్లింగ్‌కు వెళ్లొచ్చు. కానీ గుంపులుగా ఉండకూడదు.

    గురువారం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరగ్గా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని.. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని (Restrictions On Christmas and New Year celebrations) ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు (Orders) ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana state government) కీలక ఆదేశాలు (Orders) జారీ చేసింది. నేటి ( శనివారం) నుంచి జనవరి 2 వతేదీ వరకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్సీలు.. తాజా ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona, Covid 19 restrictions, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు