TELANGANA GOVERNMENT IMPOSE BAN ON SALE AND USE FIREWORKS BY PEOPLE AND ORGANISATIONS SU
తెలంగాణలో టపాసులపై నిషేధం.. కీలక ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలో టపాసుల వినియోగాన్ని నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వెంటనే రాష్ట్రంలో ఉన్న టపాసుల దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది.
రాష్ట్రంలో టపాసుల వినియోగాన్ని నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వెంటనే రాష్ట్రంలో ఉన్న టపాసుల దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాణసంబాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రజలు, సంస్థలు బాణసంచా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్టు తెలంగాణ పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు, రాష్ట్రంలోని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తీసుకున్న చర్యలను నవంబర్ 16వ తేదీలోపు ప్రభుత్వానికి తెలుపాలని కోరింది.
బాణసంచా వినియోగానికి దూరంగా ఉంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. ఇక, కరోనా తీవ్రత నేపథ్యంలో బాణసంచాను నిషేధించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన న్యాయవాది ఇంద్రప్రకాశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి విజయ్సేన్రెడ్డిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కరోనా వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తుతున్నాయని పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు.
టపాసులు పేల్చడం ద్వారా ఏర్పడే వాయు కాలుష్యంతో ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ బాణసంచా నిషేధంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదని, కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు స్వీయ నియంత్రణలు పాటిస్తారని ఆశిస్తున్నదని తెలిపారు.
వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడే వాయు కాలుష్యం శ్వాస కోశ ఇబ్బందులు సృష్టిస్తుందని తెలిపింది. గాలి నాణ్యత కూడా తీవ్రత దెబ్బతింటున్న సంగతి అందరికి తెలిసిందేనని పేర్కొంది. మరోవైపు దేశంలో కొన్ని చోట్ల కరోనా సేకండ్ వేవ్ మొదలైందని చెప్పింది. పండుగలు ముఖ్యమేనని, అయితే ప్రజల ప్రాణాలు అంతకంటే ప్రధానమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బాణసంచాపై నిషేధం విధించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.