Home /News /telangana /

TELANGANA GOVERNMENT HAS TAKEN A DECISION BY GIVING CHECK POWER TO ZP CHAIRMEN AND MPPS PRV

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి జెడ్పీ చైర్మ‌న్లు, ఎంపీపీల‌కూ ఆ పవర్​

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మ‌న్లు, మండ‌ల స్థాయిలో ఎంపీపీల‌కు కొత్త బాధ్యతలు ఇస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

    తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మ‌న్లు, మండ‌ల స్థాయిలో ఎంపీపీల‌కు చెక్ ప‌వ‌ర్ ఇస్తూ (giving check power to ZP chairmen and MPPs) రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు లిఖిత పూర్వ‌కంగా సంబంధిత శాఖ అధికారులు విడుద‌ల చేయ‌నున్నారు.  స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌, పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి విజ్ఞ‌ప్తి, సీఎం కేసీఆర్ (CM KCR)​ ఆదేశాల మేర‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంబంధిత శాఖ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

    జిల్లా, మండ‌ల స్థాయిల్లో..

    ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లా ప‌రిష‌త్ ల‌లో జిల్లా ప‌రిష‌త్‌ సీఈవో, అకౌంట్స్ ఆఫీస‌ర్ ల‌కు జాయింట్ అకౌంట్ ఉండేది. అలాగే మండ‌ల స్థాయిలో ఎంపీడీఓ, సూప‌రింటెండెంట్ ల‌కు జాయింట్ అకౌంట్ ఉండేది. అయితే, గ్రామ స్థాయిలో స‌ర్పంచ్ ల‌కు, ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ఉంది. జిల్లా, మండ‌ల స్థాయిల్లో కూడా జెడ్పీ చైర్మ‌న్లు, ఎంపీపీల‌కు చెక్ ప‌వ‌ర్ ఇవ్వాల‌ని స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, క‌ల్వ‌కుంట్ల క‌విత‌లు చాలా కాలంగా సీఎం కేసీఆర్​ గారికి, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుగారికి విజ్ఞ‌ప్తులు చేశారు.

    జెడ్పీల‌కు 5 శాతం నిధులు..

    అలాగే జెడ్పీ చైర్మ‌న్లు (ZP Cahrimans), ఎంపీపీలు (MPP) సైతం సీఎంను క‌లిసిన సంద‌ర్భంలో ఇదే అంశాన్ని కోరారు. ఈ విష‌య‌మై సీఎఎం కేసీఆర్ (CM KCR)​, మంత్రి ఎర్ర‌బెల్లి (Errabelli dayakar rao)కి ఆదేశాలు ఇవ్వ‌డంతో, మంత్రి సంబంధిత శాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ హ‌న్మంత‌రావుల‌తో ఈ రోజు స‌మావేశ‌మై వెంట‌నే ఆదేశాలు జారీ చేయాల‌ని ఆదేశించారు. త్వ‌ర‌లోనే ఈ ఆదేశాలు జారీ కానున్నాయి. అయితే, 15వ ఆర్థిక సంఘం నిధులలో గ్రామ పంచాయ‌తీల‌కు 85 శాతం, ఎంపీపీల‌కు 10 శాతం, జెడ్పీల‌కు 5 శాతం నిధులు వినియోగించుకునే వీలుంది. ఈ నిధుల కేటాయింపు, విడుద‌లలో ఆ ఆదేశాలు జారీ చేసిన‌ప్ప‌టి నుంచి జెడ్పీ చైర్మ‌న్లు, ఎంపీపీల‌కు చెక్ ప‌వ‌ర్ ద‌క్క‌నుంది.

    సీఎంకు కవిత, పోచంపల్లి ధన్యవాదాలు..

    ఇదిలావుండ‌గా, స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (MLC kavitha), పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డిలు సీఎం కేసీఆర్​, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుల‌కు  ధ‌న్య‌వాదాలు తెలిపారు. స‌ర్పంచ్‌ల త‌ర‌హాలోనే ఎంపీపీలు, జెడ్పీ చైర్మ‌న్ల‌కు కూడా చెక్ ప‌వ‌ర్ ఇవ్వాల‌ని చేసిన విజ్ఞ‌ప్తిని సీఎం గారు ఆలోచించి, మంత్రి గారికి ఆదేశాలివ్వ‌డం, మంత్రి ఎర్ర‌బెల్లి గారు సంబంధిత అధికారుల‌కు ఆదేశాలివ్వ‌డం వ‌ల్ల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎంపీపీలు, జెడ్పీ చైర్మ‌న్ల కోరిక నెర‌వేరుతున్న‌ద‌ని వారు అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Telangana Government, Telangana mptc zptc elections 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు