Home /News /telangana /

TELANGANA GOVERNMENT HAS RECEIVING APPLICATION FROM FAMILIES TO GIVE COVID DEATH EX GRATIA CLICK HERE TO KNOW HOW TO APPLY PRV

covid death ex gratia in Telangana: తెలంగాణలో కోవిడ్​ మృతుల కుటుంబాలు ప్రభుత్వం నుంచి రూ. 50 వేలు ఎక్స్​గ్రేషియా పొందడానికి దరఖాస్తులు ఎలా చేసుకోవాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి కరోనా మరణానికి రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ దరఖాస్తులు ఎలా చేసుకోవాలో ఎవరికీ తెలియడం లేదు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
    కోవిడ్​ మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం (covid death ex gratia) చెల్లించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ -19తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .4 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్లను దాఖలయ్యాయి. ఈ క్రమంలో ప్రతి కరోనా మరణాని (Covid deaths)కి రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుల ప్రక్రియ గతంలోనే ప్రారంభమైంది.

    కేంద్రం ఉత్తర్వుల మేరకు తెలంగాణ (Telangana)లో కరోనాతో మృతిచెందిన వారి అర్హులైన సమీప కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు (covid death ex gratia in Telangana)  ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేలను ఎక్స్ -గ్రేషియా (Ex Gratia)గా అందచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ ఎక్స్-గ్రేషియా పొందేందుకు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను (Applications) దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణా శాఖ (Telangana Government Disaster Management Department) తెలియచేసింది.

    మీ సేవా కేంద్రాల ద్వారా..

    కరోనా మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్ల (Documents)తో రాష్ట్రంలోని 4,500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెంట్లను జత పరచి మీ సేవా (Mee seva) కేంద్రాల ద్వారా పంపాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్ లు సభ్యులుగా ఉండే కరోనా మరణ నిర్దారణ కమిటీ కోవిద్-19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని, దీని అనంతరం ఎక్స్-గ్రేషియాను (covid death ex gratia in Telangana) మరణించిన వారి సమీప బంధువుల అకౌంట్లలో జమ చేయనున్నట్టు తెలిపారు. ఇతర వివరాలకు మీసేవా ఫోన్ నెంబర్ 040 -48560012 అనే నెంబర్ కు లేదా meesevasupport@telangana.gov.in  మెయిల్ కు సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ.. ఈ దరఖాస్తులను పరిశీలించి... కోవిడ్ డెత్ ధ్రువప్రతాలను జారీ చేయనుంది. మృతుల కుటుంబసభ్యులు పంచాయతీ లేదా... మున్సిపాల్టీ నుంచి డెత్​ సర్టిఫికేట్, కోవిడ్ పాజిటివ్ రిపోర్టును దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ రిపోర్టు లేకపోతే.. వైరస్ కారణంగా..అడ్మిట్ అయిన ఆస్పత్రి నుంచి మరణాన్ని ధృవపరిచే మెడికల్ సర్టిఫికేట్‌ను జత చేయాలి. లేదంటే, కరోనా చికిత్సలో చేసిన పరీక్షల బిల్లులు, ఇతరత్రా పేపర్లు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్, ధృవపత్రాలతో రూ. 50 వేల పరిహారం కోసం... ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

    కాగా, ఈ మరణ ధ్రువీకరణల్లో కేవలం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందిన వారివే కోవిడ్​ మరణాలుగా అధికారులు ధ్రువీకరిస్తున్నారని.. చికిత్స పొంది ఇంటికి వెళ్లాక మృతిచెందిన వారి విషయంలో తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona, Corona deaths, Covid cases

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు