నీటి సమస్యకు అత్యాధునిక సాంకేతికతో చెక్.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ..

ఈ పరికరం వల్ల నిమిషానికి 5 లీటర్ల నీరు మాత్రమే సరఫరా కానుంది. ఒకవేళ ఎవరైనా నల్లాకు మోటారును బిగించినా అంతకుమించి నీరు సరఫరా కాకుండా ఈ వాల్వ్ నియంత్రిస్తుంది.

news18-telugu
Updated: July 18, 2020, 12:24 PM IST
నీటి సమస్యకు అత్యాధునిక సాంకేతికతో చెక్.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ..
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం మానవాళిని వేధిస్తోన్న సమస్య నీరు. గతంలో ఒక్క వేసవి కాలంలోనే నీటి సమస్య తీవ్రంగా ఉండేది. రానురాను వర్షాకాలం, శీతాకాలంలోనూ నీటి కొరత వేధిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా నీటి సమస్యను అధిగమించేందుకు మేధావులు, నిపుణులు, ఆయా రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏండ్ల తరబడిగా ఈ ప్రయత్నాలు సాగుతున్నా.. నిర్దిష్టమైన పరిష్కార మార్గం దొరకలేదు. ప్రధానంగా ఆయా రాష్ట్రాలు ఇంటింటికీ నీటి సరఫరా చేసే సమయంలో కొంతమంది నల్లాలకు మోటార్లు బిగించి అధిక నీటిని తోడుకుంటున్నారు. దీంతో కొంతమందికే నీరు పుష్కలంగా రావడం.. మిగతా వారికి అసలే నీరు సరఫరా కావడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీన్ని నియంత్రిచేందుకు ఇప్పటివరకు ఎటువంటి పరిష్కార మార్గం లభించలేదు. ఇదిలావుంటే.. ప్రజలకు తాగు నీటి సమస్యను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది.

అయితే ఈ పథకం కింద మంచినీటిని నల్లాల ద్వారా ఇంటింటికి సరఫరా చేయనుంది. అయితే ఇప్పటికే పంచాయతీ రాజ్ విభాగం పరిధిలో ఇంటింటికి సరాఫరా చేస్తున్న నీటికి సంబంధించి కొత్తమంది నల్లాకు మోటారు బిగించి నీటిని తోడేస్తున్నారు. దీంతో అందరికీ నీరు సమానంగా సరఫరా కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కింద ఇచ్చిన నల్లా కనెక్షన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్ అనే పరికరాన్ని బిగించింది. ఈ పరికరం వల్ల నిమిషానికి 5 లీటర్ల నీరు మాత్రమే సరఫరా కానుంది. ఒకవేళ ఎవరైనా నల్లాకు మోటారును బిగించినా అంతకుమించి నీరు సరఫరా కాకుండా ఈ వాల్వ్ నియంత్రిస్తుంది.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు సైతం ఈ సాంకేతిక పరికరాన్ని ఉపయోగించి నీటి సరఫరాలో అసమానతలు, నీటి వృథాను అరికట్టాలని జాతీయ జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ మనోజ్ కుమార్ సాహు సూచించారు. ఈ మేరకు మనోజ్ కుమార్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఆయా రాష్ట్రాలు అధ్యయనానికి సాంకేతిక బృందాలను తెలంగాణకు పంపి.. తెలంగాణలో వినియోగించిన సాంకేతికతను అనుసరించాలని వివరించారు.
Published by: Narsimha Badhini
First published: July 18, 2020, 12:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading