హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gram panchayats: గ్రామపంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​న్యూస్​.. పూర్తి వివరాలివే

Gram panchayats: గ్రామపంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​న్యూస్​.. పూర్తి వివరాలివే

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

గ్రామాలే (Villages) దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తే  రాష్ట్రం, ఆ తర్వాత దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గ్రామాలే (Villages) దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తే  రాష్ట్రం, ఆ తర్వాత దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్​ ప్రభుత్వం (CM KCR) నూతన భవనాలను (New Buildings)నిర్మించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dhayakar rao), స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో సొంత భవనంలేని గ్రామ పంచాయతీ (Gram Panchayat) ఉండకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఇరువురు తెలిపారు. పరిపాలనలో సీఎం కేసీఆర్‌ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని, తండాలు, గోండుగూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని (Hyderabad) మంత్రుల నివాస సముదాయం మంత్రి ఎర్రబెల్లి నివాసంలో తండాలు, ఏజెన్సీగూడేల్లో పంచాయతీ భవనాల నిర్మాణం, నిధులు, విధి విధానాలు, కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలపై మంత్రు లు సమీక్షించారు.

సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని..

తెలంగాణలోని గ్రామ పంచాయతీలన్నింటికీ కొత్త భవనాలను దశలవారీగా నిర్మిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పారు. ఇందులో ఎస్టీ గ్రామ పంచాయతీల్లో భవనాలులేని తండాలు 1,097, ఏజెన్సీ ప్రాంతాల్లో 688 ఉన్నాయని చెప్పారు. మైదాన ప్రాంత గ్రామ పంచాయతీల్లో 2,960 గ్రామాలకు భవనాలు లేవన్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 4,745 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాల అవసరం ఉన్నదని అధికారులు వివరించారు. వీటిలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలకు అనుగు ణంగా భవనాలను నిర్మిస్తామని మంత్రులు చెప్పారు. కొన్ని గ్రామాల్లో కొత్త భవనాల నిర్మాణం ప్రగతిలో ఉన్నదని, మరికొన్నింటి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. 

45 రోజుల్లో నీరందిస్తాం..

మరోవైపు మంత్రి హరీశ్​ రావు కూడా తెలంగాణ రైతులకు గుడ్​న్యూస్​ చెప్పారు. 45 రోజుల్లో పంపు హౌజ్‌ల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని, యాసంగి పంట‌కు నీరందిస్తాం.. రైతులు రందీ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. నిజానికి గోదావ‌రికి చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని మంత్రి హ‌రీశ్‌రావు గారు పేర్కొన్నారు.

Telangana: తెలంగాణ మంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. పదవికే ఎసరు రానుందా?

గోదావ‌రికి అత్య‌ధికంగా 1986లో వ‌ర‌ద‌లు అధికంగా న‌మోదు అయ్యాయి. 1986లో 107.5 మీట‌ర్ల వ‌ర‌ద గోదావ‌రిలో వ‌చ్చింది. గోదావ‌రి న‌ది చ‌రిత్ర‌లోనే ఈ వ‌ర‌ద అత్య‌ధికం. మొన్న గోదావ‌రి న‌దికి చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంత వ‌ర‌ద వ‌చ్చింది. ఈసారి 108.2 మీట‌ర్ల వ‌ర‌ద న‌మోదైంది. 1986లో వ‌చ్చిన వ‌ర‌ద కంటే కూడా 1.2 మీట‌ర్లు ఎక్కువ‌. ఈ అసాధార‌ణ‌మైన వ‌ర‌ద రావ‌డం వ‌ల్ల పంపు హౌజ్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద‌ల ఉండే ర‌బ్బ‌ర్ సీల్‌లు ఊడిపోయి పంపు హౌజ్‌ల్లోకి నీళ్లు పోయాయి. ఇది దుర‌దృష్ట‌క‌రం. ఇది ప్రకృతి వైప‌రీత్యం. ప్ర‌కృతి వైప‌రీత్యం జ‌రిగిప్పుడు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయని వెల్లడించారు.

First published:

Tags: CM KCR, Telangana Government, Village

ఉత్తమ కథలు