హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: దిగొచ్చిన తెలంగాణ సర్కార్..డిగ్రీ విద్యార్థులు అనుకున్నది సాధించారుగా!

Telangana: దిగొచ్చిన తెలంగాణ సర్కార్..డిగ్రీ విద్యార్థులు అనుకున్నది సాధించారుగా!

దిగొచ్చిన తెలంగాణ సర్కార్

దిగొచ్చిన తెలంగాణ సర్కార్

డిగ్రీ విద్యార్థుల ఆందోళనతో తెలంగాణ సర్కార్ (Telangana Government) దిగొచ్చింది. విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రా రెడ్డి (Sabhitha Indhra reddy) నిజాం కాలేజీ విద్యార్థులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 100 శాతం హాస్టల్ ను యూజీ విద్యార్థులకు కేటాయించారు. కాగా మొదట 50-50 శాతం హాస్టల్ కేటాయించగా..విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో మంత్రి పూర్తి హాస్టల్ ను వారికే కేటాయిస్తామని తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డిగ్రీ విద్యార్థుల ఆందోళనతో తెలంగాణ సర్కార్ (Telangana Government) దిగొచ్చింది. విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రా రెడ్డి (Sabhitha Indhra reddy) నిజాం కాలేజీ విద్యార్థులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 100 శాతం హాస్టల్ ను యూజీ విద్యార్థులకు కేటాయించారు. కాగా మొదట 50-50 శాతం హాస్టల్ కేటాయించగా..విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో మంత్రి పూర్తి హాస్టల్ ను వారికే కేటాయిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి : చేపల కోసం వేటకు సముద్రంలో వల వేసిన జాలారికి షాక్.. గుడి కట్టాలని మత్స్యాకారుల నిర్ణయం..?

అసలేం జరిగింది?

నిజాం కాలేజీ హాస్టల్ లో సీట్ల భర్తీ కోసం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఆ సీట్లలో 50 శాతం పీజీ విద్యార్థులకు 50 శాతం డిగ్రీ విద్యార్థుల చొప్పున మొత్తం సీట్లను భర్తీ చేస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనికోసం నవంబర్ 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని నవంబర్ 19న లిస్ట్ రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే దీనిని నిరసిస్తూ డిగ్రీ విద్యార్థులు ఆందోళన బాట చేపట్టారు. హాస్టల్ లో మొత్తం సీట్లు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో 2017లో కేటీఆర్ నిజాంకు వచ్చి సమస్య పరిష్కారం కోసం 5 కోట్లు కేటాయించారని విద్యార్థులు పేర్కొన్నారు. కానీ మా  ఇంతవరకు పరిష్కరించడం లేదన్నారు.

Elephant in Well: బావిలో పడ్డ భారీ ఏనుగు.. రాత్రంతా అలాగే ఘీంకారాలు.. ఎలా బయటకు తీశారంటే?

ఇక నిజాం విద్యార్థుల నిరసనకు ఏబీవీపీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. అంతేకాదు బషీర్ బాగ్ లోని మంత్రి కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఉస్మానియా వీసీ విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని వారు మండిపడ్డారు. గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్న పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ స్పందించి సమస్యను పరిష్కరించాలన్నా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఈరోజు మంత్రి కార్యాలయాన్ని ముట్టడించినట్లు ఏబీవీపీ నాయకులు చెప్పారు. లోపలి వెళ్లేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించగా  అడ్డుకున్నారు. దీనితో మంత్రి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అయితే మంత్రి కార్యాలయాన్ని ముట్టడించిన కొన్ని గంటలకు సబితా ఇంద్రారెడ్డి నిజాం కాలేజీకి వెళ్లారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. 100 శాతం హాస్టల్ డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని ఆదేశించారు. మంత్రి నిర్ణయంతో యూజీ విద్యార్థులు నిరసనను విరమించి కృతజ్నతలు తెలిపారు.

First published:

Tags: Hostel students, Students, Telangana

ఉత్తమ కథలు