Home /News /telangana /

TELANGANA GOVERNMENT GOOD NEWS FOR JUNIOR DOCTORS WHO DECIDED TO GO FOR STRIKE AK

Telangana: జూనియర్ డాక్టర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: ట్విట్టర్‌లో జూనియర్ డాక్టర్లు చేసిన విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.

    తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన జూనియర్ డాక్టర్ల అంశంపై తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ట్విట్టర్‌లో జూనియర్ డాక్టర్ల విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. హౌస్ సర్జన్, పీజీలపై స్టైఫండ్ 15 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను ఈ రోజే విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

    వారం తమ డిమాండ్లను అంగీకరించకపోతే సమ్మె తప్పదని జూడాలు తెలంగాణ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. రెండు వారాల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15 శాతం జీతం పెంచాలని, 10 శాతం ఇన్సెంటివ్స్ చెల్లించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి నెలకొంది. అయితే వారి డిమాండ్ల పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో జూనియర్ డాక్టర్ల సమ్మెను నివారించినట్టయ్యింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు