తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు..

సీఎం కేసీఆర్(ఫైల్)

మత్స్యకారులకు గుడ్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. చెరువుల్లో చేపల వేటకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.

  • Share this:
    Telangana News : కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదు. కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. మే 7 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించిన విషయం తెలిసిందే. ఫుడ్ ప్రాసెసింగ్ సహా పరిమిత రంగాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. తాజాగా, మత్స్యకారులకు గుడ్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. చెరువుల్లో చేపల వేటకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. లాక్‌డౌన్ ప్రభావంతో వాళ్లంతా ఉపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఉపాధి కోసం చెరువుల్లో చేపల వేటకు అనుమతి ఇచ్చింది.

    కరోనా సోకకుండా ఉండేందుకు మత్స్యకారులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. కాగా, రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి సామర్థ్యం రాష్ట్రంలో ఉంది. అయితే, లాక్‌డౌన్ దెబ్బకు ఉత్పత్తి తగ్గి కొన్ని ప్రాంతాల్లో చేపల కొరత ఏర్పడింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: