Telangana: తెలంగాణలో కొత్త మండలం.. ఆ జిల్లాలో.. సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే ఉత్తర్వులు..

తెలంగాణ మ్యాప్

Telagnana: నేడు సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. దుబ్బాకలో బీజేపీ గెలిచిన తరువాత సీఎం కేసీఆర్ తొలిసారి జిల్లాకు వస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

  • Share this:
    తెలంగాణ ఏర్పడిన అనంతరం అనేక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. సిద్దిపేట జిల్లాలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ధూళిమిట్ట కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. హుస్నాబాద్‌ డివిజన్‌లోని 8 గ్రామాలతో ధూళిమిట్ట మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఈ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ధూళిమిట్ట మండలం కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 11న అభ్యంతరాలను స్వీకరించి ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

    ఇందుకు సంబంధించి అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు తుది ఉత్తర్వులు వెల్లడించింది. ఇప్పటి వరకు మద్దూరు మండలం పరిధిలో ఉన్న ధూళిమిట్ట, లింగాపూర్‌, జాలపల్లి,తోర్నల, బైరాన్‌పల్లి, బెక్కల్‌, కొండాపూర్‌,కూటిగల్‌ ఎనిమిది గ్రామాలు బుధవారం నుంచి ధూళిమిట్ట మండల పరిధిలోకి రానున్నాయి.

    నేడు సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. దుబ్బాకలో బీజేపీ గెలిచిన తరువాత సీఎం కేసీఆర్ తొలిసారి జిల్లాకు వస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉదయం 10 గంటలకు ఎర్రవల్లి నుంచి సీఎం రోడ్డు మార్గాన సిద్దిపేటకు బయలుదేరుతారు. 11.10కి ఐటీ టవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత మిట్టపల్లిలో రైతు వేదికను ప్రారంభిస్తారు. అనంతరం ఎన్సాన్‌పల్లి శివారులోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రారంభించనున్నారు.

    అక్కడే వెయ్యి పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. కోమటిచెరువును సందర్శించి నెక్లెస్‌రోడ్డును తిలకించనున్నారు. 12.45 గంటలకు నర్సాపూర్‌ శివారులోని డబుల్‌ బెడ్రూం మోడల్‌ కాలనీలో గృహప్రవేశాలు చేయించనున్నారు. 1.40 గంటలకు చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ మధ్యలో నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే మంత్రులతో కలిసి మధ్యాహ్నభోజనం చేస్తారు. 3 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
    Published by:Kishore Akkaladevi
    First published: